చేప పిల్లలకు బదులు నగదు ఇవ్వాలి : జీవన్ రెడ్డి

చేప పిల్లలకు బదులు నగదు ఇవ్వాలి : జీవన్ రెడ్డి
  •  సీఎం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి లేఖ

హైదరాబాద్, వెలుగు: మత్స్యకారులకు పంపిణీ చేస్తున్న చేప పిల్లలకు బదులు నగదు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆదివారం సీఎంకు ఆయన లేఖ రాశారు. చేప పిల్లల పంపిణీలో పలు అవకతవకలు జరగడం, దళారుల ప్రమేయం ఉండడంతో మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం ఖర్చు చేస్తున్న నిధులు సరైన విధంగా వినియోగం జరగడం లేదని వివరించారు. 

దీన్ని దృష్టిలో ఉంచుకొని మత్స్య సహకార సంఘాలకు చెరువుల్లో నీటి నిల్వ, వాటి విస్తీర్ణాన్ని పరిగణనలోకి తీసుకొని చేప పిల్లలకు బదులు నగదు రూపంలో నిధులు విడుదల చేయాలని కోరారు. ఇలా చేస్తేనే ప్రభుత్వ లక్ష్యం నెరవేరనుందని, ఇదే సమయంలో మత్స్యకారులకు వృత్తిపరంగా ఆర్థిక చేయూత ఇచ్చినట్లవుతుందని సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు.