IND vs WI 2nd ODI: గువాహటి వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో వన్డేలో యువ ఆల్ రౌండర్ నమన్ ధీర్ (Naman Dhir) ఫీల్డింగ్‌లో అద్భుతమైన క్యాచ్ పట్టుకుని అందరినీ ఆకట్టుకున్నాడు. విండీస్ బ్యాటర్లు దూకుడుగా ఆడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టిస్తున్న సమయంలో, నమన్ ధీర్ పట్టిన ఒక డైవింగ్ క్యాచ్ మ్యాచ్‌లోనే ప్రధాన ఆకర్షణగా నిలిచింది.
నమన్ ధీర్ స్టన్నింగ్ డైవింగ్ క్యాచ్:
ఇన్నింగ్స్ ప్రారంభంలో ప్రసిద్ధ్ కృష్ణ వేసిన గుడ్-లెంత్ బాల్ కాస్త నెమ్మదిగా వచ్చింది. దీనిని ఎదుర్కొన్న వెస్టిండీస్ ఓపెనర్ కీసి కార్టీ (Keacy Carty) డ్రైవ్ చేయడానికి ప్రయత్నించగా, బాల్ బ్యాట్ ఎడ్జ్ తీసుకుని కవర్ పాయింట్ దిశగా నేలమీద పడేలా దూసుకెళ్లింది. కానీ అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న నమన్ ధీర్ క్షణాల వ్యవధిలో స్పందించి, లెఫ్ట్ సైడ్ మెరుపు వేగంతో ముందుకు డైవ్ చేస్తూ రెండు చేతులతో అద్భుతంగా క్యాచ్ అందుకున్నాడు.
►ALSO READ | ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో విరాట్ దూకుడు: నెంబర్-1 అయ్యేనా.. టాప్-5లో ముగ్గురు ఇండియన్స్!
థర్డ్ అంపైర్ చెకింగ్:
గ్రౌండ్‌లో బంతి నేలను తాకిందా లేదా అనే సందేహం కలగడంతో ఆన్-ఫీల్డ్ అంపైర్లు ఈ వికెట్‌ను థర్డ్ అంపైర్‌కు రిఫర్ చేశారు. రిప్లేలో వివిధ కోణాల నుంచి పరిశీలించగా.. నమన్ ధీర్ వేళ్లు బంతి కింద సురక్షితంగా ఉన్నట్లు స్పష్టమైంది. దీంతో థర్డ్ అంపైర్ దీనిని క్లీన్ క్యాచ్‌గా ప్రకటించి కార్టీని అవుట్‌గా వెల్లడించారు. బంతి గ్రౌండ్‌కు అతి సమీపంలో పట్టుకున్నట్లు కనిపించినప్పటికీ, నమన్ ధీర్ మెరుపు వేగంగా స్పందించిన తీరు క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
In the air... and in comes a diving Naman Dhir ✈️
— BCCI (@BCCI) September 30, 2026
Prasidh Krishna with the opening breakthrough ☝️
Updates ▶️ https://t.co/6XCYRtZLAi#TeamIndia | #INDvWI | @mflone_ | @prasidh43 pic.twitter.com/QrcMAljwHE
