పుష్ప తరహాలో పశువుల అక్రమ రవాణా

పుష్ప తరహాలో  పశువుల అక్రమ రవాణా
  • పంతంగి టోల్​ప్లాజా వద్ద పట్టివేత

చౌటుప్పల్, వెలుగు: పుష్ప సినిమాను తలపించేలా పశువులను అక్రమ రవాణా చేస్తూ పట్టుబడ్డారు. చౌటుప్పల్  సీఐ మన్మధ కుమార్  తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని ఈస్ట్  గోదావరి జిల్లాకు చెందిన కుమారస్వామి తన డీసీఎంలో రెండు భాగాలు చేసి పై భాగంలో పేపర్  అట్టలతో కూడిన బాక్సులను అమర్చాడు. కింది భాగంలో 12 ఆవులు, 21 ఎద్దులను రాజమండ్రి సంతలో కొనుగోలు చేసి హైదరాబాద్​లోని బహుదూర్ పుర కబేళాకు తరలిస్తున్నాడు. 

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్  మండలం పంతంగి టోల్ ప్లాజా వద్ద బజరంగ్ దళ్  కార్యకర్తలు, చౌటుప్పల్  పోలీసులు పట్టుకున్నారు. పై భాగంలో అమర్చిన అట్ట పెట్టలను తొలగించడంతో లోపల ఉన్న పశువులు బయటపడ్డాయి. డ్రైవర్ పై కేసు నమోదు చేసి, ఆవులను హైదరాబాద్ లోని గోశాలకు తరలించారు.