రన్నింగ్ కారు నుంచి మహిళ బాడీని విసిరేసి..

రన్నింగ్ కారు నుంచి మహిళ బాడీని విసిరేసి..

కోయంబత్తూర్: తమిళనాడులోని కోయంబత్తూరులో దారుణం జరిగింది. రన్నింగ్ కారులో నుంచి ఓ మహిళ బాడీని విసిరేసి పరారయ్యారు. ఇవాళ (మంగళవారం) తెల్లవారుజామున  కోయంబత్తూరులోని చిన్నయంపాళ్యం చెక్‌పోస్ట్ దగ్గర రోడ్డుపై ఓ మహిళ డెడ్‌బాడీని పోలీసులు గుర్తించారు. దీంతో పోలీసులు అక్కడి సీసీ కెమెరా ఫుటేజీని పోలీసులు పరిశీలించారు. స్కార్పియో నుంచి ఒక మహిళను విసేరేయడం ఆ కెమెరాల్లో రికార్డ్ అయింది. ఆ మహిళ ఫేస్ గుర్తు పట్టడానికి వీలు లేకుండా చిధ్రమైపోయిందని పోలీసులు తెలిపారు.

ఈ ఘటనపై రెండు టీమ్స్‌గా ఏర్పడి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెప్పారు. సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా ఆ కారు నంబర్ గుర్తించి నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. అయితే ఆ మహిళను చంపేసి కారులో నుంచి డెడ్‌బాడీ విసిరేశారా? లేక బతికి ఉండగానే రన్నింగ్ కారులో నుంచి రోడ్డుపైకి విసరడంతో ఆమె మరణించిందా అన్న కోణంలోనూ ఇన్వెస్టిగేట్ చేస్తున్నామని పోలీసులు తెలిపారు.