పిల్లలపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఇంజనీర్‌ను అరెస్ట్ చేసిన సిబిఐ

పిల్లలపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఇంజనీర్‌ను అరెస్ట్ చేసిన సిబిఐ

ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వంలో పనిచేస్తున్న ఓ ఇంజనీర్ ను సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. నిందితుడు 10 సంవత్సరాలకు పైగా 50మంది చిన్నారుల్ని లైంగిక వేధించి, వారిఫోటోల్ని, వీడియోల్ని డార్క్ వెబ్ లో అమ్ముకుంటున్నట్లు అధికారులు గుర్తించారు. ఉత్తర్ ప్రదేశ్ లోని బండా, చిత్రకూట్ మరియు హమీర్‌పూర్ జిల్లాల నుంచి 5ఏళ్ల నుంచి 16వయస్సున్న బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారంటూ భారీ స్థాయిలో కేసులు నమోదయ్యాయి. అయితే ఈ కేసులపై దృష్టిసారించిన ప్రభుత్వం..విచారణ చేపట్టాలంటూ కేసును సీబీఐ అధికారులకు అప్పగించింది.

విచారణ చేపట్టిన సీబీఐ అధికారులు ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వంలో ఇంజినీర్ గా పనిచేస్తున్న రామ్ భావన్ అనే ఉద్యోగి పై అనుమానం వ్యక్తం చేశారు. దీంతో చిత్రకూట్ జిల్లాలో ఉన్న నిందితుడు రామ్ భావన్ ఇంటిపై దాడులు చేశారు. ఈ దాడుల్లో 8ఫోన్లు, 8లక్షల క్యాష్, సెక్స్ టాయిస్,ల్యాప్ ట్యాప్ లతో పాటు చైల్డ్ సెక్సువల్ అబ్యూజ్ మెటీరియల్ ను స్వాధీనం చేసుకున్నారు.

ఈ సందర్భంగా సీబీఐ అధికారులు మాట్లాడుతు నిందితుడు బాలికల్ని పెద్ద ఎత్తులో లైంగిక వేధింపులకు పాల్పడ్డారని, లైంగిక వేధింపులకు పాల్పడే సమయంలో వీడియోలు తీసి వాటిని డార్క్ వెబ్ అమ్ముకున్నట్లు గుర్తించినట్లు చెప్పారు. కేసు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.