క్షుద్రపూజలు, లివింగ్ రిలేషన్షిప్స్ అంటూ అమ్మాయిల గొంతుతో ఫోన్లు: ఆదిలాబాద్ జిల్లాలో నలుగురు అరెస్టు

క్షుద్రపూజలు, లివింగ్ రిలేషన్షిప్స్ అంటూ అమ్మాయిల గొంతుతో ఫోన్లు: ఆదిలాబాద్ జిల్లాలో నలుగురు అరెస్టు

హెలో సర్.. మీరేమైనా సమస్యల్లో ఉన్నారా..? అనుకున్న పనులు జరగటం లేదా.. క్షుద్రపూజలు చేస్తాం.. మీ లైఫే మారిపోతుంది అంటూ కొందరినీ.. లైఫ్ బోరింగ్ గా ఉందా.. లివింగ్ రిలేషన్షిప్ పై ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి.. అంటూ ఇలా అమ్మాయిల గొంతుతో మరి కొందరినీ బురడీ కొట్టించి లక్షల రూపాయలు కొల్లగొట్టిన కేటుగాళ్లను పోలీసులు అరెస్టు చేశారు. 

అమ్మాయి గోంతులతో  మాట్లాడుతున్న కిలాడీ మగాళ్లను శనివారం (నవంబర్ 01) ఆదిలాబాద్  జిల్లా కేంద్రంలో అరెస్టు చేశారు పోలీసులు. అమ్మాయిల గొంతుతో కవ్విస్తూ.. విచ్చలవిడిగా మోసాలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. 

క్షుద్ర పూజలతో  సమస్యలు దూరం చేస్తామంటు  ప్రజల నుంచి వసూళ్లకు పాల్పపడినట్లు పోలీసులు చెప్పారు.  లివింగ్ రిలేషన్స్ అంటూ లక్షలు వసూలు చేసినట్లు తెలిపారు. ఈ కేసులో నలుగురు నిందితులను అరెస్టు చేశారు పోలీసులు.  నిందితులు  సూర్యపేట జిల్లాకు చెందినవారిగా గుర్తించారు. నలుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.