కవిత కస్టడీపై తీర్పు రిజర్వ్ చేసిన రౌస్ అవెన్యూ కోర్టు

కవిత కస్టడీపై తీర్పు రిజర్వ్ చేసిన రౌస్ అవెన్యూ కోర్టు

ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో అరెస్టై తీహార్ జైలులో ఉన్న  బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను సీబీఐ అరెస్టు చేసింది. ఏప్రిల్ 11వ తేదీ గురువారం సాయంత్రం కవితను అరెస్టు చేస్తున్నట్లు సీబీఐ వెల్లడించింది. శుక్రవారం ఉదయం ఆమెను ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు హాజరుపర్చారు సీబీఐ అధికారులు.  కవితను 5 రోజుల కస్టడీకి ఇవ్వాలని కోర్టును కోరారు సీబీఐ తరపు లాయర్.  

కవిత అరెస్ట్ పై కోర్టులో వాదనలు వినిపించారు ఆమె తరపు న్యాయవాదులు. జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నప్పుడు కోర్టు అనుమతి లేకుండా అరెస్ట్ చేయడం కుదరదన్నారు. సీబీఐ అధికారులు నిబంధనలు పాటించలేదని తెలిపారు.  అయితే అరెస్ట్ కు ఒక రోజు ముందే సమాచారం ఇచ్చామన్నారు సీబీఐ అధికారులు.  ఫోన్ లో అమె భర్తకు సమాచారం తెలిపామన్నారు.  ఇరు వర్గాల వాదనలు విన్న ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు.. కవిత కస్టడీపై తీర్పు రిజర్వ్ చేసింది. కవితను సీబీఐ అరెస్ట్ చేయడం కరెక్టేనని స్పష్టం చేశారు జడ్జి. తనకు ముందే సమాచారం ఇచ్చారని చెప్పారు. అనుమతి విషయం తనపరిధిలోనిదన్న జడ్జి... దీనిపై మళ్లీ కామెంట్ చేయొద్దన్నారు. ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు కస్టడీపై తీర్పు వెల్లడించనున్నట్లు కోర్టు తెలిపింది.