వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డికి మరోసారి సీబీఐ నోటీసులు

వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డికి మరోసారి సీబీఐ  నోటీసులు

వైఎస్ వివేకానంద హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డికి సీబీఐ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈ నెల 28న విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. హైదరాబాద్ లోని సీబీఐ కార్యాలయంలో ఉదయం 11గంటలకు విచారణకు రావాలని స్పష్టం చేసింది. కాగా మూడు రోజుల క్రితమే అవినాష్ రెడ్డికి సీబీఐ నోటీసులు జారీ చేసింది. నిన్న విచారణకు హాజరుకావాలని అందులో పేర్కొంది. అయితే బిజీ షెడ్యూల్ కారణంగా విచారణకు హాజరుకాలేనని సీబీఐకి ఆయన లేఖ రాశారు. దీంతో సీబీఐ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈ కేసు ఫైళ్లు కడప కోర్టు నుంచి హైదరాబాద్ సీబీఐ కోర్టుకు చేరాయి. కేసు విచారణను హైదరాబాద్ సీబీఐ కోర్టుకు బదిలీ చేస్తూ ఇటీవలె సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది,.