హత్రాస్ గ్యాంగ్ రేప్ కేసులో సీబీఐ విచారణ : యూపీ ప్రభుత్వంతో టచ్ లోనే ఉన్నాం

హత్రాస్ గ్యాంగ్ రేప్ కేసులో సీబీఐ విచారణ : యూపీ ప్రభుత్వంతో టచ్ లోనే ఉన్నాం

ఉత్తర్ ప్రదేశ్ హత్రాస్ గ్యాంగ్ రేప్ ఘటనపై సీబీఐ విచారణ ప్రారంభించింది. హత్రాస్ జిల్లాలో సెప్టెంబర్ 14న  19ఏళ్ల యువతి పై నలుగురు దుర్మార్గులు అత్యంత పాశవికంగా ఆమె పై దాడిచేసి అత్యాచారం చేశారు. అపై తీవ్రంగా గాయపరిచి ఆమెను హత్య చేసేందుకు ప్రయత్నించారు. అయితే చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న బాధితురాల్ని ఆమె కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించారు. రెండు వారాల తరువాత ఆస్పత్రిలో చికిత్స పొందిన  బాధితురాలు  మృతి చెందింది. ఈ దారుణంపై దేశ వ్యాప్తంగా ఆందోళనలు చెలరేగాయి. నిందితుల్ని కఠినంగా శిక్షించాలంటూ ప్రజలు డిమాండ్ చేశారు. తాజాగా ఈ కేసును సీబీఐ విచారణ చేపట్టినట్లు..సీబీఐ స్పోక్ పర్సన్ ఆర్కే గౌర్ తెలిపారు. ఈ కేసు విచారిస్తున్న సీబీఐ బృందానికి మహిళా డీఎస్పీ సీమా పహూజా నాయకత్వం వహిస్తుంది.  కాగా ఇవాళ సీబీఐ అధికారులు, ఫోరెన్సిక్ టీం దారుణం జరిగిన ఘటానస్థలంలో ఆధారాల్ని సేకరించనుంది.

మరోవైపు యూపీ హోం కార్యదర్శి భగవాన్ స్వరూప్ శ్రీవాస్తవ అధ్యక్షతన ముగ్గురు సభ్యుల స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం (సిట్) అక్టోబర్ 1నుంచి ఈ కేసు దర్యాప్తు ప్రారంభించింది. ఈ కేసుకు సంబంధింత వివరాల కోసం సీబీఐ అధికారులు సిట్ బృందంతో టచ్ లోనే ఉన్నట్లు సీబీఐ స్పోక్ పర్సన్ ఆర్కే గౌర్ తెలిపారు.