
గత నెల రోజులుగా యూజీ నీట్ 2024 ఎగ్జామ్ పేపర్ లీక్ అయ్యిందని జరుగుతున్న ఆరోపణలకు, జరుగుతున్న ఆంధోళనలకు చెక్ పెట్టడానికి కేంద్ర ప్రభుత్వ ఆ కేసును సీబీఐకి అప్పగించింది. శనివారం ప్రభుత్వ నీట్ పరీక్ష అవకతవకలపై సీబీఐ విచారణకు ఆదేశించింది. విద్యా మంత్రిత్వ శాఖ ఫిర్యాదు మేరకు నీట్ పరీక్ష పేపర్ లీక్ కేసులో సీబీఐ రెగ్యులర్ కేసు నమోదు చేసింది. IPC సెక్షన్ 420, 120B కింద గుర్తుతెలియని వ్యక్తులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది.
బీహార్, గుజరాత్‌ల రాష్ట్రాల్లో నీట్ పై నమోదైన కేసులను సీబీఐ స్వాధీనం చేసుకోలేదు. దేశవ్యాప్తంగా జరిగిన నీట్ ఎగ్జామ్ లో జరిగిన తప్పులపై మాత్రమే ప్రస్తుతం సీబీఐ దర్యాప్తు చేస్తుంది. ఇరు రాష్ట్రాల పోలీసుల అంగీకారం తర్వాత, అవసరమైనప్పుడు వారి కేసును స్వాధీనం చేసుకుని, కేసు డైరీని తీసుకోవచ్చు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) NEET(UG) పరీక్షను 5 మే 2024న OMR (పెన్ మరియు పేపర్) మోడ్‌లో నిర్వహించింది.
షెడ్యూల్ ప్రకారం జూన్ 14న దీని ఫలితాలు విడుదల కావాలి.. కానీ అంతకంటే ముందుగానే జూన్ 4న రిజల్ట్స్ ప్రకటించారు. ఫలితాల్లో 67 మంది విద్యార్థులు టాప్ ప్లేస్ లో ఉన్నారు. అంటే 720కి 720 మార్కులు వచ్చాయి. దీంతో అక్రమాలు మరియు పేపర్ లీక్‌లు జరిగినట్లు ఆరోపిస్తూ నిరసనలు ప్రారంభమైయ్యాయి.