
మంచిర్యాల జిల్లా వెంకటాపూర్ గ్రామంలో జరిగిన సజీవదహనం కేసు హత్యేనని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. దీనికి సంబంధించి సీసీ ఫుటేజీని స్వాధీనం చేసుకున్నారు. నస్పూర్ సమీపంలోని ఓ పెట్రోల్ బంకులో నిందితులు డీజిల్ కొన్న విజువల్స్ సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. డీజిల్ కొన్నవాళ్లు మేడి లక్ష్మణ్, ఎరుకల రమేష్ లుగా గుర్తించారు. డీజీల్ తీసుకుని ఆటోలో వెళ్లి శివయ్య ఇంటిపై డీజిల్ చల్లి అంటిచినట్లుగా నిర్ధారణ అయ్యింది. వీరికి వెంకటాపూర్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి సహకరించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ముగ్గురు పోలీసులు అదుపులో ఉన్నారు.
శాంతయ్యను చంపాలని ఆయన మొదటి భార్య సృజన.. మేడి లక్ష్మణ్ కు చెప్పినట్లు తెలుస్తోంది. ఇందుకోసం సుపారి మాట్లాడుకున్నారు. అయితే డబ్బు రూపంలో కాకుండా 30లక్షల విలువ చేసే భూమి ఇచ్చేటట్లుగా ఒప్పందం జరిగిందని తెలుస్తోంది. గతంలో కూడా శాంతయ్యను లక్ష్మణ్ కిడ్నాప్ చేసినట్లు పోలీసులు విచారణలో గుర్తించారు. నెల రోజలు క్రితం కూడా శాంతయ్యను కిడ్నాప్ చేశారు. అప్పుడు వారి నుంచి శాంతయ్య తప్పించుకున్నాడు.
మంచిర్యాల జిల్లాలో ఆరుగురు సజీవ దహనమయ్యారు. శుక్రవారం అర్ధరాత్రి 12:30 గంటల సమయంలో శివయ్య ఇంటికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో ఇంట్లో పడుకున్నోళ్లు పడుకున్న చోటనే ముద్దలయ్యారు. కనీసం గుర్తుపట్టడానికి కూడా వీలు లేకుండా డెడ్ బాడీలు కాలిపోయాయి. చనిపోయినోళ్లలో ఒకే కుటుంబానికి చెందినోళ్లు ఐదుగురు ఉన్నారు. మృతుల్లో ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు.