న్యూఢిల్లీ: ఇక నుంచి స్టాక్అప్డేట్స్ను స్థానిక భాషల్లో అందజేస్తామని సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ లిమిటెడ్ (సీడీఎస్ఎల్) ప్రకటించింది. ‘ఆప్కా సీఏఎస్–ఆప్కీ జుబానీ’ కార్యక్రమం కింద సీడీఎస్ఎల్ 23 భారతీయ భాషలకు మద్దతు ఇచ్చేలా కన్సాలిడేటెడ్ అకౌంట్ స్టేట్‌మెంట్ (సీఏఎస్)ని అప్‌గ్రేడ్ చేసింది.
పెట్టుబడిదారులు ఇప్పుడు వారికి నచ్చిన భాషలో స్టేట్‌మెంట్‌లను పొందవచ్చు. సీఏఎస్ వినియోగదారులకు వారి డీమ్యాట్ ఖాతా సెక్యూరిటీలను ‘కన్సాడిడేటెడ్వ్యూ’ పద్ధతిలో చూడవచ్చు. 'సీడీఎస్ఎల్ బడ్డీ సహాయ 24X7' సీడీఎస్ఎల్ వెబ్‌సైట్‌లో నాలుగు ప్రాంతీయ భాషల్లో కస్టమర్లకు సేవలను అందిస్తుంది.
