సీఈసీని జ్ఞానేశ్ కుమార్ ను తొలగించాలి: ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య

సీఈసీని జ్ఞానేశ్  కుమార్ ను తొలగించాలి: ప్రభుత్వ విప్  బీర్ల అయిలయ్య

 ప్రధాన ఎన్నికల అధికారి(సీఈసీ) జ్ఞానేశ్​కుమార్​ను తొలగించాలని ప్రభుత్వ విప్​, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్లు లేవనెత్తిన అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోకుండా జ్ఞానేశ్​కుమార్​ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని, దీంతో అర్హులైన ఓటర్లు తమ హక్కు కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

అక్షర దోషాలను కూడా సరిదిద్దుకోకుండా నోటీసులు పంపించడమేమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఈసీని తొలగించాలని డిమాండ్​ చేస్తూ యాదాద్రి కలెక్టరేట్​ వద్ద సోమవారం ఆందోళన నిర్వహిస్తామని ఆయన ప్రకటించారు.