రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల

రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల

రాజ్యసభ ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ను ప్రకటించింది. మార్చి 6న నోటిఫికేషన్ విడుదల చేసి.. మార్చి 26న ఎన్నికలు జరపాలని సీఈసీ నిర్ణయించింది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ ఎన్నికలు జరగనున్నాయి. అదేరోజు సాయంత్రం ఫలితాలు ప్రకటించనున్నారు.  మార్చి 13 నామినేషన్ దాఖలుకు చివరితేదీగా నిర్ణయించారు.  దేశవ్యాప్తంగా 17 రాష్ట్రాల్లోని 55 సీట్లకు ఎన్నిక నిర్వహించనున్నట్లు సీఈసీ తెలిపింది. తెలంగాణ నుంచి రెండు రాజ్యసభ సీట్లకు ఎన్నిక జరగనుంది. తెలంగాణకు చెందిన రాజ్యసభ సభ్యులు కేవీపీ రామచంద్రరావు, గరికపాటి మోహనరావుల పదవికాలం ఏప్రిల్‌లో ముగియనుంది. దాంతో ఆ రెండు స్థానాలకు ఎన్నిక జరగనుంది. ఎంపీ కేశవరావు ఏపీ కోటాలో ఎన్నికయ్యారు. ఆయన పదవికాలం కూడా ఏప్రిల్‌లోనే ముగియనుంది. ఇక ఏపీలో నాలుగు సీట్లకు ఎన్నికలు జరగనున్నాయి.

For More News..

తొలి 5జీ ఫోన్ వచ్చేసిందోచ్.. ధర ఎంతో తెలుసా..

జమ్మూ కశ్మీర్‌లో మార్చి 4 వరకు ఇంటర్‌నెట్ సేవలు బంద్