
గోదావరిఖని, వెలుగు : పెద్దపల్లి జిల్లా సింగరేణి రామగుండం రీజియన్ పరిధిలోని జీడీకే11వ గనిలో శుక్రవారం మధ్యాహ్నం పైకప్పు కూలడంతో ఓ కార్మికుడు స్వల్పంగా గాయపడ్డాడు. గనిలోని మూడో సీమ్, 50వ లెవల్‌లో జనరల్ మజ్దూర్ కార్మికుడు గొర్రె శ్రీకాంత్‌తో పాటు మరో ఇద్దరు పనిచేస్తున్నారు. ఈ ప్రాంతంలో పైకప్పు లీడ్ ఎక్కువగా ఉండి రూఫ్ బోల్డ్ పొడవు తక్కువగా ఉండడంతో సుమారుగా మూడు నుంచి నాలుగు ఇంచుల మందం పైకప్పు కూలింది.
తక్కువ మందంతో పైకప్పు కూలడంతో శ్రీకాంత్‌కు స్వల్ప గాయాలుఅయ్యాయి. గమనించిన మిగతా కార్మికులు శ్రీకాంత్‌ను గోదావరిఖనిలోని సింగరేణి ఏరియా హాస్పిటల్‌కు తరలించారు. శ్రీకాంత్‌ను గుర్తింపు సంఘం లీడర్లు మడ్డి ఎల్లాగౌడ్, ఆరెల్లి పోచం, రంగు శ్రీను, మాదన మహేశ్, నాయిని శంకర్, సాయన్న, సంతోష్ పరామర్శించారు.