కరోనా భయం లేకుండా.. కరోనా ఫెస్ట్.. వీడియో వైరల్

కరోనా భయం లేకుండా.. కరోనా ఫెస్ట్.. వీడియో వైరల్

లాక్డౌన్ లో నిర్వహించిన యువకుడు
సోషల్ డిస్టెన్సింగ్ పాటించలేదని అరెస్ట్ చేసిన పోలీసులు

కరోనాకు ప్రపంచదేశాలన్నీ వణుకుతుంటే.. ఒక యువకుడు మాత్రం కరోనా ఫెస్ట్ నిర్వహించి తన స్నేహితులందరికీ విందు ఏర్పాటు చేశాడు.
కరోనా వ్యాప్తిని అరికట్టాలంటే సోషల్ డిస్టెన్సింగ్ ఒక్కటే మార్గమని భావించిన ప్రధాని మోడీ.. మే 3 వరకు లాక్డౌన్ పొడిగించారు. ప్రతి ఒక్కరూ సోషల్ డిస్టెన్సిగ్ పాటించాలని ఆదేశాలిచ్చారు.

అయితే తమిళనాడు, తంజావూరు జిల్లాలోని కబిస్థలం గ్రామానికి చెందిన శివగురు మాత్రం ‘కరోనా విందు’ పేరుతో ఒక విందును ఏర్పాటు చేశాడు. దానికి అతని స్నేహితులను పిలిచి వారందరికీ భోజనాలు ఏర్పాటు చేశాడు. ఆ సమయంలో వారంతా సోషల్ డిస్టెన్సింగ్ పాటించకుండా ఒకరి పక్కన మరోకరు అంటిపెట్టుకుని కూర్చున్నారు. పొడవాటి అరటి ఆకులను వేసి.. వాటిపై అన్నం, కూర వేసుకొని అంతా ఎదురెదురుగా కూర్చొని తిన్నారు. ఆ కార్యక్రమాన్ని అంతా వీడియో తీసి ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్ చేశారు. అది చూసిన ఆ గ్రామ వీఏఓ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు శివగురును మరియు అతని స్నేహితులను అరెస్టు చేశారు. లాక్ డౌన్ సమయంలో సోషల్ డిస్టెన్సింగ్ నియమాలను ఉల్లఘించినందుకు వారిని అరెస్టు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసిన గ్రామ వీఏఓ మాట్లాడుతూ.. ‘శివగురు గతంలో త్రిపూర్ లో పనిచేసేవాడు. ఈ మద్యే మా ఊరికి వచ్చాడు. లాక్డౌన్ నియమాలు పాటించకుండా పార్టీని ఏర్పాటు చేశాడు. దీనిని ఇలాగే వదిలేస్తే మరింత మంది మళ్లీ ఇలాగే చేస్తారు. అందుకే ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లాను. ఒకే అరటి ఆకులో అందరూ కలిసి తినడం వల్ల కరోనా వ్యాప్తి చెందే అవకాశాలున్నాయి. ఆ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది’ అని అన్నారు.

For More News..

ఫాంహౌస్ లో పెళ్లి చేసుకున్న యంగ్ హీరో నిఖిల్

వృద్ధురాలిని చంపిన దివ్యాంగుడు.. వీడియో తీసిన పొరుగింటి వ్యక్తి

కొడుకు కోసం మూడు రోజుల్లో ఆరు రాష్ట్రాలు దాటి..