
దహెగాం, వెలుగు: సెల్‌ఫోన్ పోగొట్టుకున్నా, దొంగతనం జరిగినా కంగారు పడొద్దని దహెగాం ఎస్సై సనత్‌కుమార్ రెడ్డి అన్నారు. నాలుగు రోజుల క్రితం పంబాపూర్‌కు చెందిన తలండి రమేశ్ లగ్గాం గ్రామం నుంచి దహెగాం వెళ్తుండగా ఫోన్ పోగొట్టుకున్నాడు. సీఈఐఆర్అప్లికేషన్ద్వారా ఫోన్‌ను రికవరీ చేసి బాధితుడికి అప్పగించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర టెలికాం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ప్రవేశపెట్టిన సీఈఐఆర్(సెంట్రల్ ఎక్విప్మెంట్ఐడెంటిటీ రిజిస్టర్)అప్లికేషన్ ఉపయోగపడుతుందని అన్నారు. ఎవరైనా సెల్ ఫోన్ పోగొట్టుకుంటే అదే నంబర్‌తో కొత్త సిమ్ కార్డు తీసుకొని మీసేవలో మొబైల్లాస్ట్ అప్లికేషన్ చేసుకోవాలి. అనంతరంwww.ceir,gov.in వెబ్సైట్లో లాగిన్ అయ్యి రెక్వెస్ట్ ఫర్ బ్లాకింగ్ లాస్ట్/స్టోలెన్ మొబైల్లింక్ క్లిక్ చేసి మొబైల్నంబర్, ఐఎంఈఐ నెంబర్లు, కంపెనీ పేరు, మోడల్, కొన్న బిల్లు, మీసేవ అప్లికేషన్నంబర్, సర్టిఫికెట్అప్లోడ్ చేసి, మొబైల్ఏ రోజు, ఎక్కడ పోయింది.
పేరు, అడ్రస్, ఐడీ కార్డు నమోదు చెయ్యడంతో మొబైల్ పని చెయ్యదు. తర్వాత సంబంధిత పోలీస్‌స్టేషన్‌లో కంప్లైంట్ చెయ్యాలని పేర్కొన్నారు. ఏ నంబర్ సిమ్ కార్డు వేసినా వెంటనే అలర్ట్ వస్తుంది. దీంతో ఫోన్ గుర్తించడం సులభమవుతుందని పేర్కొన్నారు.