ఓటర్లకు అలర్ట్: పోలింగ్ కేంద్రాల్లోకి సెల్ ఫోన్ అనుమతి లేదు..

ఓటర్లకు అలర్ట్: పోలింగ్ కేంద్రాల్లోకి సెల్ ఫోన్ అనుమతి లేదు..

పోలింగ్ కేంద్రాల్లోకి పోలీసు అధికారులు సెల్ ఫోన్లను అనుమతించడం లేదు. దీంతో ఎన్నిక నిబంధనలతో ఓటర్లలో గందరగోళం మొదలైంది. ఈ విషయంపై అవగాహన లేకపోవడంతో ఓటర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.    

రంగారెడ్డి జిల్లాలో మొబైల్ ఫోన్ల కారణంగా ఓటర్లు ఇబ్బందులు పడుతున్నారు. పోలింగ్ కేంద్రం లోపలికి మొబైల్ ఫోన్లు అనుమతి లేదు అనడంతో.. అవి ఎక్కడ పెట్టాలనే విషయంలో ఓటర్లు అమోమయానికి గురవుతున్నారు. 

ఓటు వేయడానికి వస్తున్న ఓటర్లందరూ మొబైల్ ఫోన్లతో రావడం పోలీసులు వాటిని అనుమతించకపోవడంతో.. ఓటర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయాన్ని మాకు ముందు చెప్పాలి కదా... అని అధికారులను ఓటర్లు నిలదీస్తున్నారు.

ఫోన్లను పోలింగ్ కేంద్రంలోనికి అనుమతించరనే నిబంధనను ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో అధికారులు విఫలమయ్యారని తెలుస్తోంది.