ఖమ్మం చిన్నపాటి వర్షానికే మున్నేరు తిప్పలు షురూ

ఖమ్మం చిన్నపాటి వర్షానికే మున్నేరు తిప్పలు షురూ

ఖమ్మం సిటీలోని మున్నేరు తీగల వంతెన వర్క్స్ కొనసాగుతుండటంతో, ఆర్ అండ్ బీ అధికారులు పాతకాలం బ్రిడ్జిని మూసివేశారు. వాహనదారులకు ఇబ్బంది కలగొద్దని వంతెన కింద చాప్ట పైన తాత్కాలిక రోడ్డును వేశారు. కాగా, చిన్నపాటి వర్షానికే మున్నేరు వరద తాత్కాలిక రోడ్డుపై నుంచి పారుతోంది.

దీంతో ఆ రోడ్డుపై రాకపోకలు నిలిపేశారు. ఖమ్మం వచ్చే వాహనదారులు, ఖమ్మం నుంచి రూరల్ ఏరియాకు వెళ్లే వారు చుట్టూ తిరిగి వెళ్తూ ఇబ్బంది పడాల్సి వస్తోంది. పాత బ్రిడ్జిని త్వరగా అందుబాటులోకి తేవాలని స్థానికులు కోరుతున్నారు. – వెలుగు ఫొటోగ్రాఫర్, ఖమ్మం