
సంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. బుధవారం(జూన్2) అర్థరాత్రి సంగారెడ్డి జిల్లా చేర్యాల గేటు దగ్గర కారును లారీ ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో హైదరాబాద్ లోని ఫిలింనగర్ ఎస్సై రాజేశ్వర్ మృతిచెందారు.విధులు ముగించుకొని వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఎస్సై రాజేశ్వర్ ను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఎస్సై రాజేశ్వర్ మృతిచెందారు.
1990 లో పోలీస్ శాఖలో చేరిన ఎస్సై రాజేశ్వర్ స్వగ్రామం సంగారెడ్డిలోని చాణక్యపురి కాలనీ. వారం రోజుల క్రితమే హైదరాబాద్ లోని ఫిలింనగర్ పోలీస్ స్టేషన్ లో ఎస్సైగా బాధ్యతలు తీసుకున్నారు రాజేశ్వర్. గత మూడు రోజులుగా బల్కంపేట యల్లమ్మ ఆలయం దగ్గర విధులు నిర్వహిస్తున్నారు.బుధవారం విధులు ముగించుకొని సంగారెడ్డికి తిరిగి వెళ్తుండగా కారును లారీ ఢీకొట్టడంతో ఎస్సై రాజేశ్వర్ మృతిచెందారు.