
వికారాబాద్, వెలుగు: హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రంలోని ధర్మశాలలో జరుగుతున్న వార్షిక కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్(సీపీఏ) ఇండియా రీజియన్, జోనల్ 2 కాన్ఫరెన్స్ కు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాను ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు.