వికారాబాద్ డీఎంహెచ్వోగా లలితాదేవి

వికారాబాద్ డీఎంహెచ్వోగా  లలితాదేవి

వికారాబాద్, వెలుగు: వికారాబాద్ జిల్లా వైద్యాధికారిగా డాక్టర్ కె.లలితాదేవి మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ డీఎంహెచ్​వోగా  పనిచేసిన డాక్టర్​ వెంకట రవణ పదవీ విరమణ పొందడంతో హనుమకొండ జిల్లాలో ప్రోగ్రాం ఆఫీసర్(డీటీటీ)గా పనిచేస్తున్న లలితాదేవిని ఇక్కడికి బదిలీ చేశారు. లలితాదేవి విధుల్లో చేరడానికి ముందు కలెక్టర్ ప్రతీక్ జైన్, అడిషనల్ కలెక్టర్లు లింగ్యా నాయక్, సుధీర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు.