జైలు స్టాఫ్ సాయంతో దందా.. ఫోన్లలోనే దంకీ ఇస్తున్న ఖైదీలు

జైలు స్టాఫ్ సాయంతో దందా.. ఫోన్లలోనే దంకీ ఇస్తున్న ఖైదీలు

వెనక్కిపోయారు. అయినా బుద్ధి మారలేదు. మంచిగా మారాలనే ఆలోచన అసలే లేదు. జైలులో ఉండే దందాలు కంటిన్యూ చేస్తున్నారు. బయట ఉన్న వాళ్లకు ఫోన్లలోనే దంకీ ఇస్తున్నారు. తాము చెప్పినట్టు చేయకపోతే ఖతం చేస్తామని బెదిరించి నేరాలు చేస్తూనే ఉన్నారు. ఈ దందాలకు జైలు అధికారులు, సిబ్బంది సాయం అందుతోంది. ఖైదీలకు సెల్ ఫోన్లు అందించి, వాళ్ల దగ్గరి నుంచి లంచాలు తీసుకుని తృప్తిపడుతున్నారు.

పంజాబ్‌లోని పలు జైళ్లలో ఈ దందా జరుగుతున్నట్లు ఇటీవల వెలుగులోకి వచ్చింది. ఆ రాష్ట్ర ప్రభుత్వం విచారణ జరిపి పలువురు అధికారులను సస్పెండ్ చేసినా తీరు మారలేదు. మళ్లా ఎప్పటిలానే దందా షురూ అయింది. దీనిపై ఫిర్యాదులు రావడంతో బటిండా జిల్లాలోని ఖైలావాలా జైలులో  రెండ్రోజుల క్రితం ఆకస్మిక తనిఖీలు చేశారు సీఆర్పీఎఫ్ పోలీసులు. మొత్తం 12 ఫోన్లు సీజ్ చేశారు. ఖైదీల బ్యారక్‌లలో 7 ఫోన్లు దొరకగా.. మరో ఐదు వేర్వేరు చోట్ల దాచి పెట్టి ఉన్నట్లు గుర్తించారు. ఇందులో రైడ్స్ జరిగే సమయంలోనే జైలు సిబ్బంది ఒకరు ఖైదీకి ఫోన్ అందిస్తూ రెడ్ హాండెడ్‌గా పట్టుబడ్డాడు. జైలులో సెల్‌ఫోన్లు కలిగి ఉండడంతో పాటు, బయట చేస్తున్న బెదిరింపులకు సంబంధించి 12 మంది ఖైదీలపై కేసులు పెట్టారు. అలాగే వారికి సహకరించిన జైలు సిబ్బందిపైనా చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.