ఈవీ కంపెనీలను ఆకర్షించేందుకు..ఈ-వెహికల్‌‌‌‌‌‌‌‌ పాలసీ

ఈవీ కంపెనీలను ఆకర్షించేందుకు..ఈ-వెహికల్‌‌‌‌‌‌‌‌ పాలసీ
  • కనీసం రూ.4,150 కోట్లు  ఇన్వెస్ట్ చేస్తే సుంకాల్లో రాయితీ
  •     బ్యాంక్ గ్యారెంటీ ఉంటేనే ..
  •     టెస్లా, బీవైడీ వంటి గ్లోబల్ కంపెనీలను ఇండియాకు రప్పించేందుకే

న్యూఢిల్లీ : ఎలక్ట్రిక్ వెహికల్స్ (ఈవీ)  తయారీ కంపెనీలను ఆకర్షించేందుకు కేంద్రం ఈ–వెహికల్ పాలసీని తీసుకొచ్చింది. ఇందులో భాగంగా  దేశంలో  కనీసం 500 మిలియన్ డాలర్లు (రూ.4,150 కోట్లు) ఇన్వెస్ట్ చేసే ఎలక్ట్రిక్ వెహికల్స్ కంపెనీలకు  సుంకాల్లో రాయితీలను  ఇవ్వనుంది. యూఎస్ కంపెనీ టెస్లాను ఆకర్షించేందుకే  సుంకాల్లో రాయితీ ఇస్తున్నారని అంచనా.  కాగా, దేశంలోకి దిగుమతి చేసుకునే తమ కార్లపై కస్టమ్స్ డ్యూటీలో  100 శాతం వరకు రాయితీ ఇవ్వాలని టెస్లా ఎప్పటి నుంచో కోరుతోంది. 

40 వేల డాలర్ల లోపు ఉండే కార్లపై 60 శాతం రాయితీ  అడుగుతోంది. ప్రభుత్వ స్టేట్‌‌‌‌‌‌‌‌మెంట్ ప్రకారం, ఇండియాలో తయారీ ప్లాంట్‌‌‌‌‌‌‌‌ను పెట్టే కంపెనీలు తక్కువ కస్టమ్స్‌‌‌‌‌‌‌‌ డ్యూటీకే  కార్లను దిగుమతి చేసుకోవచ్చు. కానీ, ఈ కార్ల  నెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పరిమితం. ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారీకి ఇండియాను హబ్‌‌‌‌‌‌‌‌గా మార్చాలనే లక్ష్యంతో ఈవీ పాలసీని ప్రభుత్వం తీసుకొచ్చింది.  గ్లోబల్‌‌‌‌‌‌‌‌ కంపెనీలను ఆకర్షించాలని చూస్తోంది. 

ఇన్వెస్ట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ను బట్టే రాయితీ

సుంకాల్లో రాయితీ కావాలంటే ఈవీ కంపెనీలు కనీసం రూ.4,150 కోట్లను ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. గరిష్టంగా ఎంతైనా ఇన్వెస్ట్ చేయొచ్చు. కానీ,  ఈవీ కంపెనీలు చేసే ఇన్వెస్ట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌కు తగ్గట్టు కస్టమ్స్ డ్యూటీలో  రాయితీ  ఆధారపడి ఉంటుంది. అంటే ఒక కంపెనీ రూ. 4,150 కోట్లు ఇన్వెస్ట్ చేస్తే ఈ అమౌంట్‌‌‌‌‌‌‌‌కు సమానమైన డ్యూటీ రాయితీలను పొందడానికి వీలుంటుంది. కంపెనీ  తన కార్ల దిగుమతులపై పొందిన మొత్తం రాయితీ ఈ అమౌంట్‌‌‌‌‌‌‌‌ను దాటితే  మళ్లీ పాత  డ్యూటీ రేట్లే వీటికి వర్తిస్తాయి.  

ఇన్వెస్ట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌కు లేదా రూ.6,484 కోట్లకు (పీఎల్‌‌‌‌‌‌‌‌ఐ స్కీమ్ కింద ఇచ్చే రాయితీకి సమానమైన అమౌంట్‌‌‌‌‌‌‌‌) (ఏది తక్కువైతే అది)  సమానమైన డ్యూటీ రాయితీని కంపెనీలు పొందడానికి వీలుంటుంది. ‘ఒకవేళ ఇన్వెస్ట్‌‌‌‌‌‌‌‌మెంట్ 800 మిలియన్ డాలర్లు (రూ.6,484 కోట్లు)  లేదా అంతకంటే ఎక్కువైతే గరిష్టంగా 40 వేలు, ఏడాదికి 8 వేల (గరిష్టంగా)  ఈవీలను  డ్యూటీ రాయితీతో దిగుమతి చేసుకోవచ్చు. ఒక ఏడాదిలో కోటా చేరుకోకపోతే , తర్వాతి ఏడాదిలో మిగిలిన కోటాను వాడుకోవచ్చు’ అని ప్రభుత్వం ఓ స్టేట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌లో పేర్కొంది. డ్యూటీ రాయితీ కావాలంటే  కంపెనీ పెట్టాలనుకుంటున్న ఇన్వెస్ట్‌‌‌‌‌‌‌‌మెంట్ కమిట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌కు బ్యాంక్ గ్యారెంటీ ఉండాలి. ఒకవేళ కంపెనీ తమ ఇన్వెస్ట్‌‌‌‌‌‌‌‌మెంట్ కమిట్‌‌‌‌‌‌‌‌మెంట్స్‌‌‌‌‌‌‌‌ను చేరుకోకపోతే  బ్యాంక్ గ్యారెంటీలను ప్రభుత్వం వాడుకుంటుంది.

15 శాతం కస్టమ్స్ డ్యూటీ

కొత్త ఈవీ పాలసీతో దేశ వినియోగదారులు  కొత్త టెక్నాలజీని యాక్సెస్ చేసుకోవడానికి వీలు కలుగుతుందని, ఇండియాలో తయారీ పెరుగుతుందని ప్రభుత్వం పేర్కొంది. ఈవీ కంపెనీల మధ్య పోటీ పెరగడంతో మొత్తం ఎకోసిస్టమ్‌‌‌‌‌‌‌‌ మెరుగవుతుందని తెలిపింది. ప్రొడక్షన్‌‌‌‌‌‌‌‌  ఊపందుకుంటుందని, ఎకానమీ వృద్ధి చెందుతుందని, ఈవీ రేట్లు దిగొస్తాయని, క్రూడాయిల్ దిగుమతులు తగ్గుతాయని, ట్రేడ్ డెఫిసిట్‌‌‌‌‌‌‌‌ తగ్గుతుందని, ఆరోగ్యం, పర్యావరణంపై పాజిటివ్ ఎఫెక్ట్ ఉంటుందని వివరించింది. పాలసీ ప్రకారం,  దేశంలో తయారీ ప్లాంట్‌‌‌‌‌‌‌‌ను పెట్టడానికి, ప్రొడక్షన్ మొదలు పెట్టడానికి మూడేళ్లు టైమ్ ఇస్తారు. 

గరిష్టంగా ఐదేళ్లలో కంపెనీ 50 శాతం ప్రొడక్షన్  డొమెస్టిక్ వాల్యూ ఎడిషన్ (డీవీఏ) కి యాడ్ అవ్వాలి. మూడో ఏట నాటికి 25 శాతం చేరుకోవాలి. మూడేళ్లలో ఇండియాలో మాన్యుఫాక్చరింగ్ ప్లాంట్ పెట్టాలనుకునే కంపెనీ, కార్లను దిగుమతి చేసుకుంటే 15 శాతం కస్టమ్ డ్యూటీ  (కంప్లీట్ నాక్డ్ డౌన్‌‌‌‌‌‌‌‌ (పార్టులను ఇండియాలో అసెంబ్లింగ్ చేయడం) యూనిట్లపై వేసినట్టే) వేస్తారు. ఖర్చు, ఇన్సూరెన్స్‌‌‌‌‌‌‌‌, రవాణా (సీఐఎఫ్‌‌‌‌‌‌‌‌) వాల్యూ 35 వేల డాలర్లు (రూ.29 లక్షలు) లేదా అంతకంటే ఎక్కువ ఉన్న కార్లపై ఐదేళ్ల వరకు కస్టమ్స్ డ్యూటీలో రాయితీ ఇస్తారు. కాగా, దేశ ఎలక్ట్రిక్ వెహికల్ మార్కెట్ వేగంగా విస్తరిస్తోంది. 2030 నాటికి ఏడాదికి కోటి ఈవీలు అమ్ముడవుతాయని, డైరెక్ట్‌‌‌‌‌‌‌‌గా, ఇన్‌‌‌‌‌‌‌‌డైరెక్ట్‌‌‌‌‌‌‌‌గా ఐదు కోట్ల జాబ్స్‌‌‌‌‌‌‌‌ క్రియేట్ అవుతాయని  ఎకనామిక్ సర్వే 2022–23 అంచనా వేసిన విషయం తెలిసిందే.