Women's ODI World Cup 2025: ప్లేయింగ్ 11లోకి జెమీమా.. కీలక మ్యాచ్‌లో ఆల్ రౌండర్‌ను పక్కన పెట్టిన టీమిండియా

Women's ODI World Cup 2025: ప్లేయింగ్ 11లోకి జెమీమా.. కీలక మ్యాచ్‌లో ఆల్ రౌండర్‌ను పక్కన పెట్టిన టీమిండియా

మహిళల వరల్డ్ కప్ లో ఇండియా, న్యూజిలాండ్ జట్ల మధ్య మ్యాచ్ ప్రారంభమైంది. గురువారం (అక్టోబర్ 23) నవీ ముంబై వేదికగా డాక్టర్ డివై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో న్యూజిలాండ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో ఇండియా మొదట బ్యాటింగ్ చేయనుంది. ఈ మ్యాచ్ లో ఇండియా ఒక మార్పుతో బరిలోకి దిగుతుంది. అత్యంత కీలకమైన మ్యాచ్ లో ఆల్ రౌండర్ అమన్ జ్యోత్ కౌర్ స్థానంలో బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్ ప్లేయింగ్ 11 లో చోటు సంపాదించింది. ఈ మార్పు ఎంత ప్రభావం చూపిస్తుందో చూడాలి. 

ఈ పోరులో గెలిస్తేనే.. ఇండియాకు సెమీస్‌‌‌‌ ‌‌‌‌‌‌‌‌బెర్త్‌‌‌‌ దక్కుతుంది. ఒకవేళ ఓడితే ఇతర జట్ల సమీకరణాలపై ఆధారపడాల్సి వస్తుంది. అప్పుడు ఆదివారం జరిగే చివరి లీగ్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌ల్లో ఇంగ్లండ్‌‌‌‌.. న్యూజిలాండ్‌‌‌‌ను ఓడించాలి. అదే టైమ్‌‌‌‌లో బంగ్లాదేశ్‌‌‌‌పై ఇండియా కచ్చితంగా నెగ్గితేనే హర్మన్‌‌‌‌సేనకు నాకౌట్‌‌‌‌ ‌‌‌‌‌‌‌‌బెర్త్‌‌‌‌ ఖాయమవుతుంది. ఈ నేపథ్యంలో బాగా పట్టున్న డీవై పాటిల్‌‌‌‌ స్టేడియంలో కివీస్‌‌‌‌తో జరిగే ఈ పోరులోనే కచ్చితంగా గెలవాలని ఇండియా లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, ఇంగ్లండ్‌‌‌‌తో జరిగిన గత మ్యాచ్‌‌‌‌ల్లో అద్భుతంగా ఆడినా ఓటమి ఎదురుకావడాన్ని ఇండియా జీర్ణించుకోలేకపోతున్నది. 

భారత మహిళలు (ప్లేయింగ్ XI):

ప్రతీకా రావల్, స్మృతి మంధాన, హర్లీన్ డియోల్, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), జెమిమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ, రిచా ఘోష్ (వికెట్ కీపర్), స్నేహ రాణా, క్రాంతి గౌడ్, శ్రీ చరణి, రేణుకా సింగ్ ఠాకూర్

న్యూజిలాండ్ మహిళలు (ప్లేయింగ్ XI): 

సుజీ బేట్స్, జార్జియా ప్లిమ్మర్, అమేలియా కెర్, సోఫీ డివైన్ (కెప్టెన్), బ్రూక్ హాలిడే, మాడీ గ్రీన్, ఇసాబెల్లా గేజ్ (వికెట్ కీపర్), జెస్ కెర్, రోజ్మేరీ మెయిర్, లియా తహుహు, ఈడెన్ కార్సన్