
తెలంగాణలో పండించిన పూర్తి ధాన్యం కేంద్రం కొంటదా? కొనదా ? చెప్పాలన్నారు సీఎం కేసీఆర్. తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ మాట్లాడిందంతా సొల్లు పురాణమన్నారు సీఎం కేసీఆర్. దేశరాజధాని ఢిల్లీలో గత ఆరు నెలలుగా రైతు చట్టాలకు వ్యతిరేకంగా చేస్తున్న ఉద్యమంలో దాదాపు 600 మంది రైతులు చనిపోయారన్నారు. దేశంలో గట్టిగా నిలదీస్తే అర్బన్ నక్సలైట్ లేదా దేశద్రోహి అని ముద్ర వేస్తున్నారన్నారు. వ్యవసాయ చట్టాలను బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ వ్యతిరేకించారన్నారు. మీకు మద్దతిచ్చినప్పుడు దేశ ద్రోహి కాదా అని ప్రశ్నించారు. అబద్ధాల మీద బతికే పార్టీ బీజేపీ అని అన్నారు. ధాన్యం ఎంత కొట్టుందో కేంద్రం చెప్పాలన్నారు. సమాధానం చెప్పేవరకు బీజేపీని వదిలిపెట్టబోమన్నారు.