ఆక్సిజన్ దిగుమతులపై 3నెలలు ట్యాక్స్ లు ఎత్తేసిన కేంద్రం

ఆక్సిజన్ దిగుమతులపై 3నెలలు ట్యాక్స్ లు ఎత్తేసిన కేంద్రం

దేశంలో కరోనా పాజిటివ్ కేసులు రోజు రోజుకూ భారీ సంఖ్యలో నమోదవుతున్నాయి. దీంతో ట్రీట్ మెంట్ కోసం ఆస్పత్రులకు వచ్చేవారు కూడా ఎక్కువగానే ఉంటున్నారు. ఈ క్రమంలో ఆస్పత్రుల్లో ఆక్సిజన్ కొరత ఏర్పడుతోంది. చికిత్స కోసం వచ్చిన పేషంట్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై  కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మూడు నెలల పాటు ఆక్సిజన్, ఆక్సిజన్ సంబంధిత పరికరాల దిగుమతులపై సుంకాలను పూర్తిగా ఎత్తివేయాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని కేంద్ర ఆర్థిక శాఖ సహాయమంత్రి అనురాగ్ ఠాకూర్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. 

విదేశాల నుంచి దిగుమతి చేసుకునే ఆక్సిజన్ పైనా, ఆక్సిజన్ పైనా 3 నెలల వరకు సాధారణ కస్టమ్స్ సుంకం, హెల్త్ సెస్ లకు పూర్తిగా మినహాయింపు ఇస్తున్నట్టు చెప్పారు. ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగిన అత్యున్నత స్థాయి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని తెలిపారు.