ఆధార్ కార్డుపై కేంద్రం గుడ్ న్యూస్: వేలిముద్రలు పడని వారికి ఐరీస్ స్కాన్

ఆధార్ కార్డుపై కేంద్రం గుడ్ న్యూస్: వేలిముద్రలు పడని వారికి ఐరీస్ స్కాన్

వేలిముద్రలు పడని వానికి గుడ్ న్యూస్ చెప్పింది కేంద్రం.. వేలిముద్రలు పడకుంటే.. ఐరీస్ స్కాన్( కళ్లు స్కాన్ ) ద్వారా ఆధార్ కార్డును పొందొచ్చని ప్రకటించింది. ఆధార్ కు అర్హత ఉన్న వ్యక్తి వేలిముద్రలు అందుబాటులో లేనట్లయితే ఐరిస్ స్కాన్ ను ఉపయోగించి నమోదు చేసుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం శనివారం తెలిపింది. వేలిముద్రలు లేని కారణంగా ఆధార్ కోసం నమోదు చేసుకోలేకపోయిన కేరళకు చెందిన జోసిమోల్ పిజోస్ అనే మహిళ కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ కు ఫిర్యాదు చేయడంతో ఇకపై వేలిముద్రలు పడని వారు ఐరిస్ స్కార్ ద్వారా ఆధార్ ను పొందేందుకు అనుమతిస్తూ ప్రకటన జారి చేశారు. 

కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ జోక్యంతో అదే రోజు కేరళలోని కొట్టాయం జిల్లా కుమరకంలో ఉన్న  జోసిమోల్ పిజోస్ ఇంటికి ఆధార్  అధికారులు వెళ్లి ఆమెను ఆధార్ నెంబర్ ఇచ్చారు. వేలిముద్రలు పడని వారికి ఐరిస్ ద్వారా ఆధార్ కార్డు జారీ చేయాలని అన్ని మీ సేవాకేంద్రాలకు ఆదేశాలు జారి చేసినట్లు కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు.

వేలిముద్రలు, కంటిపాప బయోమెట్రిక్ అందించలేని ఆధార్ కు అర్హులైన వారికి రెండింటిని సమర్పించకున్నా ఆధార్ జారీ చేయాలని కేంద్రం ఈ ప్రకటనలో తెలిపింది. వేలిముద్రలు, కంటిపాప బయోమెట్రిక్ అందించలేని వారికి వాటిని హైలైట్ చేస్తూ..బయోమెట్రిక్ తోపాటు క్యాప్చర్ చేయబడుతుందని తెలిపారు. ఆధార్ ఎన్ రోల్ మెంట్ సెంటర్ సూపర్ వైజర్ అటువంటి ఎన్ రోల్ మెంట్ ను అసాధారణమైనదిగా గుర్తించాలని పేర్కొంది. 

కేంద్ర ప్రభుత్వం ప్రకటన ప్రకారం.. UUDAI అసాధారణ  నమోదు కింద రోజుకు 1000 మందిని  నమోదు చేస్తుంది. ఇప్పటివరకు ఇలాంటి వేలిముద్రలు పడనివారికి ,వేలి, ఐరీస్ పడని వారికి దాదాపు 29 లక్షల మందికి ఆధార్ నెంబర్లను జారీ చేసినట్లు కేంద్రం ప్రకటించింది.