
న్యూఢిల్లీ: మందులు, వైద్య పరికరాలు, కాస్మెటిక్ ఉత్పత్తుల నాణ్యత, భద్రతను మెరుగుపరచేందుకు కేంద్రం కొత్త చట్టాన్ని రూపొందిస్తోంది. దీంతో నియంత్రణ సంస్థలకు మరింత అధికారాలు లభించనున్నాయి. ‘డ్రగ్స్, మెడికల్ డివైజెస్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ 2025’ ముసాయిదాను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సమావేశంలో డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) రాజీవ్ రఘువంశీ ప్రవేశపెట్టారు.
ఈ చట్టం అమలయ్యాక సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ నకిలీ, నాణ్యతలేని మందుల తయారీదారులపై తక్షణ చర్యలు తీసుకోవచ్చు. లైసెన్సింగ్ ప్రక్రియను డిజిటల్ చేయడం, రాష్ట్ర స్థాయి నియంత్రణ సంస్థల మధ్య సమన్వయం పెంచడం వంటి ఈ చట్టంలో ఉన్నాయి.