కరోనా చికిత్సకు కేంద్రం గైడ్​లైన్స్​

కరోనా చికిత్సకు కేంద్రం గైడ్​లైన్స్​

న్యూఢిల్లీ: దేశంలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 918 కొత్త కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ సోమవారం వెల్లడించింది. వైరస్ కారణంగా కేరళలో ఒకరు, రాజస్థాన్, కర్నాటకల్లో ఇద్దరు చొప్పున చనిపోయారు. తాజా కేసులతో దేశంలో యాక్టివ్ కేసుల  సంఖ్య 6,350 కి చేరింది. 

ఆరోగ్య శాఖ మార్గదర్శకాలు

కరోనా నిర్ధారణ అయ్యేంతవరకు యాంటీబయాటిక్స్ వాడొద్దని కేంద్రం స్పష్టంచేసింది. కరోనా సోకిన యుక్తవయసు- వారి ట్రీట్మెంట్ కోసం లోపినావిర్–-రిటోనావిర్, హైడ్రాక్సీక్లోరోక్విన్, ఐవర్‌‌మెక్టిన్, మోల్నుపిరవిర్, ఫావిపిరావిర్, అజిత్రోమైసిన్, డాక్సీసైక్లిన్ వంటి మందులను ఉపయోగించకూడదని వెల్లడించింది. కరోనా కేసులు పెరుగుతున్నందున కేంద్రం కొత్త గైడ్ లైన్స్ రిలీజ్ చేసింది. ట్రీట్మెంట్ సమయంలో కరోనా ఇన్ఫెక్షన్‌‌తో పాటు ఇతర అంటువ్యాధులను కూడా తప్పకుండా పరిగణనలోకి తీసుకోవాలని గైడ్ లైన్స్​లో పేర్కొంది.