టూరిజం అభివృద్ధికి కొత్తం పథకం తెచ్చిన కేంద్రం

టూరిజం అభివృద్ధికి కొత్తం పథకం తెచ్చిన కేంద్రం

న్యూఢిల్లీ: దేశంలో పర్యాటక రంగం అభివృద్ధిపై కేంద్ర ప్రభుత్వం స్పెషల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫోకస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పెట్టింది. దీని కోసం ‘దేఖో అప్నా దేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’ పథకాన్ని ప్రకటించింది. ఇందులో భాగంగా దేశంలోని 50 ప్రాంతాలను ఒక ప్యాకేజీగా తీసుకొని అభివృద్ధి చేయడానికి ప్లాన్ రూపొందిస్తోంది. దీని కోసం రూ.1,412 కోట్లు కేటాయించింది. ఈ పథకం ముఖ్యంగా దేశంలోని మధ్యతరగతి ప్రజలను లక్ష్యంగా చేసుకొని తీసుకొచ్చారు. పర్యాటక ప్రాంతాలను చూసేందుకు విదేశాలకు వెళ్లడం కంటే దేశంలో పలు టూరిస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్లేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను సందర్శించేలా చేయడం కోసం ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. దీని ద్వారా దేశ వారసత్వ సంపద, సంస్కృతి గురించి ప్రజలు తెలుసుకునే అవకాశం లభిస్తుంది.

పర్యాటక రంగంలో ఉద్యోగాల సృష్టితో పాటు యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు రానున్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థకు కూడా తోడ్పాటు అందనుంది. రాష్ట్రాల సహకారంతో పాటు ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలను భాగస్వామ్యం చేస్తూ టూరిజాన్ని అభివృద్ధి చేస్తామని కేంద్రమంత్రి నిర్మల చెప్పారు. దేశీయ పర్యాటకులతో పాటు వీదేశీ టూరిస్టులను కూడా ఆకర్షించేలా దేఖో అప్నా దేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పథకాన్ని రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. ఈ పథకానికి సంబంధించి ప్రత్యేక వెబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సైట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పాటు టోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫ్రీ హెల్ప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కూడా అందుబాటులోకి తేనున్నట్లు తెలిపారు. వెబ్​సైట్​లో హోటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ధరలు, ప్రయాణ చార్జీలు, పర్యాటక ప్రాంతాల్లో ఎంట్రీ ఫీజు తదితర వివరాలు ఉంటాయి. అలాగే స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించడానికి, అమ్మడానికి ఆయా టూరిస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్లేసుల్లో ‘యూనిటీ మాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’లను కూడా ఏర్పాటు చేయనున్నారు. ఇందులో హస్తకళ ఉత్పత్తులు కూడా ఉంటాయి.