193 మంది పాకిస్తానీలను పంపేందుకు ఒకే

193 మంది పాకిస్తానీలను పంపేందుకు ఒకే
  • ఈ నెల 5న పంపేందుకు చర్యలు
  • ఉత్తర్వులు జారీ చేసిన మంత్రిత్వ శాఖ

న్యూఢిల్లీ: కరోనా లాక్‌డౌన్‌ కారణంగా మన దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఇరుక్కుపోయిన 193 మంది పాకిస్తానీలను తమ దేశానికి పంపేందుకు ఎక్స్‌టర్నల్‌ మినిస్ట్రీ ఓకే చెప్పింది. ఈ నెల 5న అట్టారీవాఘా బోర్డర్‌‌ ద్వారా వాళ్లను పాకిస్తాన్‌కు వెళ్లేందుకు అనుమతిచ్చింది. 5వ తారీఖు పొద్దున కల్లా ఆయా రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన వారిని బోర్డర్‌‌కు చేర్చేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలక ఆదేశాలు జారీ చేసింది. ఇమ్మిగ్రేషన్‌ తదితర ఫార్మాలిటీస్‌ అన్నీ పూర్తి చేసి వారిని పంపేందుకు చర్యలు తీసుకుంటున్నామని అధికారులు చెప్పారు. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో చిక్కుకున్న వారిని పంపించాలని పాకిస్తాన్‌ కోరడంతో ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. లాక్‌డౌన్‌ విధించిన తర్వాత ఇక్కడ ఇరుక్కుపోయిన పాకిస్తాన్‌ పౌరులను సొంత దేశానికి పంపడం ఇదే రెండోసారి. అయితే ఇంత ఎక్కువ సంఖ్యలో వెళ్లడం ఇదే మొదటిసారి.