
స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ 25,271 కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. పదో తరగతి పాసైతే చాలు కేంద్ర పారామిలిటరీ బలగాల్లో కొలువు కొట్టొచ్చు. సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్స్, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, సెక్రటేరియల్ సెక్యూరిటీ ఫోర్స్, రైఫిల్‌మెన్ ఇన్ అసోం రైఫిల్స్‌లో కానిస్టేబుల్ పోస్టులు ఉన్నాయి. అర్హులైన అభ్యర్థులు ఆగస్టు 31వ తేదీ లోపు అప్లై చేసుకోవచ్చు.
పదో తరగతి తర్వాత పోలీస్ విభాగంలో చేరాలనుకునే అభ్యర్థులకు పారామిలటరీ బలగాల నోటిఫికేషన్ మంచి అవకాశం. ఈ ఉద్యోగాల భర్తీని స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ చేపడుతుంది.
మొత్తం ఖాళీలు: 25, 271(బీఎస్ఎఫ్ - 7545, సీఐఎస్ఎఫ్ - 8464, ఎస్ఎస్బీ - 3806, ఐటీబీపీ - 1431, ఏఆర్ - 3785, ఎస్ఎస్ఎఫ్ - 240)
సెలెక్షన్ ప్రాసెస్: కంప్యూటర్ ఆధారిత పరీక్ష, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, పీఎస్‌టీ, మెడికల్ టెస్ట్.
ఫిజికల్ టెస్ట్: పురుషులు 24 నిమిషాల్లో 5 కిలోమీటర్లు, మహిళలు 8.1/2 నిమిషాల్లో 1.6 కిలోమీటర్లు పరుగెత్తాలి. .
ఎగ్జామ్ ప్యాటర్న్: కంప్యూటర్ బేస్డ్ పరీక్షలో ఎగ్జామ్ ఉంటుంది. 90 నిమిషాల్లో 100 ప్రశ్నలకు 100 మార్కులు ఉంటాయి. మొత్తం నాలుగు విభాగాలు ఉంటాయి. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్(25 మార్కులు), జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్ (25 మార్కులు), ఎలిమెంటరీ మ్యాథ్స్ (25 మార్కులు)ఇంగ్లిష్/హిందీ (25 మార్కులు) ఉంటాయి.
మ్యాథ్స్‌పై ఫోకస్ చేయాలి
ఎస్ఎస్‌సీ కానిస్టేబుల్ కొలువు కొట్టాలంటే మ్యాథ్స్‌పై ఎక్కువ ఫోకస్ చేయాలి. 50శాతం మార్కులు అర్థమెటిక్ మీదే అడుగుతారు. ఫిట్‌నెస్ కోసం డైట్ ఫాలో అవ్వాలి. గ్రౌండ్ ప్రాక్టీస్ క్రమం తప్పకుండా చేయాలి.
- బండి మనోజ్ కుమార్, సీఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్ (2015 బ్యాచ్)
అర్హత: పదోతరగతి ఉత్తీర్ణత.
వయసు: 18-23 ఏండ్లు.
దరఖాస్తులు: ఆన్‌లైన్‌లో అప్లై చేయాలి.
చివరితేది: 31 ఆగస్టు
సీబీటీ ఎగ్జామ్: త్వరలో ప్రకటిస్తారు.
వెబ్‌సైట్: www.ssc.nic.in