పాన్-ఆధార్ లింక్ : కేంద్రానికి రూ.601 కోట్ల ఆదాయం

పాన్-ఆధార్ లింక్  : కేంద్రానికి  రూ.601 కోట్ల ఆదాయం

పాన్‌ కార్డుతో ఆధార్‌తో లింక్  చేసుకోవాలని  కేంద్రం చెబుతూ వస్తోంది.  ఇందుకోసం పలుమార్లు గడువును కూడా పొడిగించింది. పాన్‌ కార్డుతో ఆధార్‌తో లింక్ చేసుకునేందుకు  రూ. 1000 ఫైన్ విధిస్తోంది.  ఈ ఫైన్‌ ద్వారా కేంద్రానికి ఇప్పటివరకు వచ్చిన ఆదాయాన్ని  కేంద్ర ఆర్థికశాఖ సోమవారం వెల్లడించింది. 2023 జులై 1 నుంచి, 2024 జనవరి 31 వరకు రూ.601.97 కోట్లు వసూలుచేసినట్లు వెల్లడించింది. 

లోక్ సభలో టీఎంసీ ఎంపీ మాలరాయ్‌ అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి పంకజ్‌ చౌదరి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. అంతేకాకుండా  పాన్‌తో అనుసంధానం కాని ఆధార్‌ కార్డుల సంఖ్య 2024 జనవరి 29 నాటికి దేశవ్యాప్తంగా 11.48 కోట్లు వెల్లడించారు.   

పాన్​-ఆధార్​కార్డ్​ లింకింగ్​ ఇలా


1. ఆదాయపు పన్ను ఈ–-ఫైలింగ్ అధికారిక వెబ్‌‌‌‌సైట్‌‌‌‌ eportal.incometax.gov.in లేదా incometaxindiaefiling.gov.inకి వెళ్లండి
2.   పోర్టల్‌‌‌‌లో ఇప్పటికే రిజిస్ట్రేషన్​ చేసుకోకపోతే రిజిస్ట్రేషన్​ చేసుకోండి. పాన్ నంబరే యూజర్ ఐడీ అవుతుంది.
3. మీ యూజర్ ఐడీ, పాస్‌‌‌‌వర్డ్  పుట్టిన తేదీని రిజిస్టర్​చేయడం ద్వారా పోర్టల్‌‌‌‌లోకి లాగిన్ అవ్వండి.
4. మీ పాన్‌‌‌‌ను ఆధార్‌‌‌‌తో లింక్ చేయాలని అడుగుతున్న పాప్- అప్ విండో ఇప్పుడు కనిపిస్తుంది.
5. విండో కనిపించకపోతే, మెనూ బార్‌‌‌‌లోని ‘ప్రొఫైల్ సెట్టింగ్స్’కి వెళ్లి ‘లింక్ ఆధార్‌‌‌‌’పై క్లిక్ చేయండి.
6. మీ పాన్ కార్డ్ వివరాల ప్రకారం పేరు, పుట్టిన తేదీ,  లింగం వంటి సమాచారం అప్పటికే కనిపిస్తుంది.
7. ఆధార్‌‌‌‌లో పేర్కొన్న వాటితో స్క్రీన్‌‌‌‌పై పాన్ వివరాలను వెరిఫై చేయండి.
8. ఏవైనా తేడాలు ఉంటే, డాక్యుమెంట్లలో మార్పులు చేసుకోవాలి. 
9. వివరాలు సరిపోలితే, మీ ఆధార్ నంబర్‌‌‌‌ను రిజిస్ట్రేషన్​ చేసి, ‘లింక్ నౌ’ బటన్‌‌‌‌పై క్లిక్ చేయండి.
10. మీ ఆధార్ మీ పాన్‌‌‌‌కి విజయవంతంగా లింక్ అయిందంటూ ఒక పాప్-అప్ మెసేజ్​ వస్తుంది. మీ ఇంటి దగ్గర్లోని మీసేవ వంటి పాన్​సర్వీస్​ సెంటర్లలోనూ ఈ పనిని పూర్తి చేసుకోవచ్చు. అక్కడికి వెళ్తే ‘అనెగ్జర్–1’ ఇస్తారు. దీనిని నింపి పాన్​, ఆధార్​కార్డు ఇవ్వాలి. కొంత సర్వీసు చార్జీ చెల్లించాల్సి ఉంటుంది.