
నిజామాబాద్/ కామారెడ్డి, వెలుగు: ఉమ్మడి నిజామాబాద్ జిల్లా మీదుగా ప్రస్తుతమున్న రైల్వే సింగిల్లైన్ను డబ్లింగ్లైన్గా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ఇచ్చింది. సికింద్రాబాద్ నుంచి ఉత్తర భారత దేశానికి కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల మీదుగా ప్రస్తుతం సింగిల్‌లైన్ ఉంది. సికింద్రాబాద్‌నుంచి మేడ్చల్వరకు ఇదివరకే డబ్లింగ్పనులు కంప్లీటయ్యాయి.
మహారాష్ట్రలోని ముథ్కేడ్ నుంచి ఏపీలోని డోన్ డబ్లింగ్ ప్రాజెక్ట్‌కు కేంద్ర క్యాబినేట్ఆమోదం తెలిపినట్లు నిజామాబాద్ ఎంపీ అర్వింద్ బుధవారం మీడియాకు వెల్లడించారు. సికింద్రాబాద్ వైపు నుంచి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా మీదుగా ప్రతీరోజు 40 ఎక్స్‌ప్రెస్, ప్యాసింజర్ రైళ్లు అటుఇటు తిరుగుతున్నాయి. గూడ్స్రైళ్లు 10 వరకు వెళ్తాయి.