
- కేంద్రం ప్రభుత్వ చర్యలను సమర్థించిన సుప్రీంకోర్టు
- ప్రాజెక్టు రైట్ ట్రాక్ లోనే వెళ్తోందని తెలిపిన కేంద్రం
న్యూఢిల్లీ: ప్రాజెక్ట్ చీతా సరైన దిశలోనే ఉందని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. కొత్తగా మరో 12- నుంచి14 చీతాలను తెస్తామని.. ప్రాజెక్టులో కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సోమవారం కోర్టుకు వివరించింది. చీతాల పునురుద్ధరణలో భాగంగా ప్రభుత్వం దక్షిణాఫ్రికా నుంచి 20 చీతాలను తీసుకొచ్చి మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్‌లో వదిలిన సంగతి తెలిసిందే. అయితే వాటిలో మూడు చిన్న పిల్లలు సహా తొమ్మిది చనిపోవడంతో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో చీతాల మృతిపై సుప్రీం కోర్టులో దాఖలైన పిటిషన్‌ను సోమవారం జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని త్రిమెంబర్ బెంచ్విచారించింది.
ప్రభుత్వం తరఫున అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటి వాదనలు వినిపిస్తూ.. ట్రాన్స్‌లోకేషన్ వల్ల కొన్ని చీతాలు చనిపోయే చాన్స్ ఉందన్నారు. ఈ ప్రాజెక్ట్ ప్రపంచంలోనే ప్రత్యేకమైనదని, దీనిపై ముందుగానే అన్ని అంశాలను స్టడీ చేసినట్లు తెలిపారు. తీవ్రమైన ఎండలకు మూడు చీతా కూనలు చనిపోయాయని చెప్పారు. బతికి ఉన్న చిరుతల ఆరోగ్య సంరక్షణకు 11 మంది ఎక్స్‌పర్ట్స్‌తో కమిటీని వేసినట్లు వివరించారు. మీడియా కథనాల్లో చెప్తున్నట్లుగా విదేశాల నుంచి తీసుకొచ్చిన వాటిలో తొమ్మిది చీతాలు చనిపోలేదని.. ఆరు మాత్రమే చనిపోయాయని ఐశ్వర్య తెలిపారు. బతికి ఉన్న చీతాల మంచి హెల్త్ ఫెలిసిటీస్కల్పించామని, నిశితంగా పరిశీలిస్తున్నామని చెప్పారు. వాదనలు విన్న బెంచ్ చీతా ప్రాజెక్టులోఅనుమానాలకు కారణాలేవి కనిపించడం లేదని పేర్కొంటూ పిటిషన్‌ను కొట్టివేసింది. ప్రాజెక్ట్‌కు సంబంధించిన నిర్ణయాలను కోర్టులకు కాకుండా ఎక్స్‌పర్ట్స్‌కు వదిలేయాలని తెలిపింది.