కేంద్ర ప్రభుత్వ పెన్షన్.. ఉద్యోగుల కుటుంబాలకు నెలకు రూ. 1.25 లక్షలు 

కేంద్ర ప్రభుత్వ పెన్షన్.. ఉద్యోగుల కుటుంబాలకు నెలకు రూ. 1.25 లక్షలు 

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల కుటుంబాలకు ఊరట కలిగే ప్రకటన చేసింది. కేంద్ర ఉద్యోగుల ఫ్యామిలీ పెన్షన్ (కుటుంబ పింఛన్) పెంచాలని సర్కారు నిర్ణయించింది. దీంతో చాలా మందికి బెనిఫిట్ కలుగనుంది. ఉద్యోగుల కుటుంబాలకు ఎక్కువ పెన్షన్ వస్తుంది. ఒక ఇంట్లో భార్యాభర్తలు ఇద్దరూ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులైతే.. వారు మరణిస్తే.. కుటుంబ సభ్యులకు ఇద్దరి పెన్షన్ వస్తుంది. అయితే ఈ పెన్షన్ లిమిట్ నెలకు రూ.45 వేలు ఉండేది. కానీ ఇప్పుడు ఈ లిమిట్‌ను పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. 

ఇప్పటి నుంచి ఉద్యోగుల పెన్షన్‌ను నెలకు గరిష్టంగా రూ.1.25 లక్షలు అందిస్తామని పెన్షన్ అండ్ పెన్షనర్స్ వెల్ఫేర్ శాఖ తెలిపింది. ఈ మేరకు కుటుంబ పెన్షన్లకు సంబంధించి 75 ముఖ్యమైన కొత్త రూల్స్‌ తీసుకొచ్చామని పెన్షనర్స్ వెల్ఫేర్ శాఖ ప్రకటించింది. పెన్షన్ తీసుకునే వృద్ధుల్లో అవేర్‌నెస్ కోసం ఈ రూల్స్‌ను తీసుకొచ్చినట్లు తెలిపింది. కొత్త రూల్స్ ప్రకారం.. కేంద్ర ప్రభుత్వం నుంచి పెన్షన్ అందుకునే ఫ్యామిలీకి గరిష్టంగా రూ.1.25 లక్షలు అందుతుంది. వీటికి డీఆర్ సమయానుగుణంగా జతవుతుంది. అలాగే నెలకు కనిష్టం మొత్తంగా రూ.9 వేల పెన్షన్ అందుకోవచ్చు. దీనికి కూడా డీఆర్ అదనంగా జతవుతుంది.