ఇక టోల్‌ ప్లాజాల వద్ద ఆగనక్కర్లేదు.. త్వరలో కొత్త టోల్‌ వ్యవస్థ

ఇక టోల్‌ ప్లాజాల వద్ద ఆగనక్కర్లేదు.. త్వరలో కొత్త టోల్‌ వ్యవస్థ

నేషనల్ హైవేలపై ఇకపై వాహనదారులు ఆగనవసరం లేకుండా త్వరలో కొత్త టోల్‌ వ్యవస్థను అమలు చేయనున్నట్టుగా కేంద్రం వెల్లడించింది.  అధునాతన సాంకేతికతతో కూడిన ఈ వ్యవస్థ అమల్లోకి వస్తే ప్రయాణికులు ఇకపై టోల్‌ ప్లాజాల వద్ద వేచి ఉండాల్సిన అవసరం ఉండదని రోడ్డు రవాణా , రహదారుల శాఖ సహాయ మంత్రి వీకే సింగ్ వెల్లడించారు.  

ప్రస్తుతం దీనికి సంబంధించిన ట్రైయిల్స్ జరుగుతున్నాయని, సక్సెస్ అయితే దేశవ్యాప్తంగా అమలు చేస్తామని  చెప్పుకొచ్చారు.  ప్రస్తుతం అమలులో ఉన్న ఫాస్టాగ్‌ వ్యవస్థతో టోల్ ప్లాజాల వద్ద వేచి ఉండే సమయాన్ని 47 సెకన్లకు తగ్గించగలిగామని.. ఆ సమయాన్ని 30 సెకన్ల కంటే తక్కువకు తగ్గించడాన్ని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని ఆయన తెలిపారు.

 ఉపగ్రహ, కెమెరాలు వంటి సాంకేతికతల ఆధారితంగా పనిచేసే ఈ నూతన టోల్‌ వ్యవస్థను ప్రస్తుతం దిల్లీ-మేరఠ్‌ ఎక్స్‌ప్రెస్‌వేలో పైలట్‌ ప్రాజెక్టు కింద పరీక్షిస్తున్నట్టుగా వీకే సింగ్ చెప్పుకొచ్చారు. మరోవైపు 2023   మార్చిలో ఢిల్లీలోసీసీఐ ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో కేంద్ర రహదారుల మంత్రి నితిన్‌ గడ్కరీ ఇదే అంశంపై మాట్లాడారు.