తదుపరి సీజేఐ పేరును సూచించండి

తదుపరి సీజేఐ పేరును సూచించండి

తర్వాత సీజేఐ (చీఫ్ జెస్టీస్ ఆఫ్ ఇండియా) పేరును సూచించాల్సిందిగా భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి UU లలిత్ ను కేంద్రం కోరింది. ఈ మేరకు లేఖ రాసినట్లు సంబంధిత వర్గాల సమాచారం. ప్రస్తుత సీజేఐ లలిత్ నవంబర్ 8న పదవీ విరమణ చేయనున్నారు. ఆయన తర్వాత సీజేఐగా జస్టిస్  డి.వై.చంద్రచూడ్ పేరు వినిపిస్తోంది. 

ఇటీవల సీనియర్ న్యాయవాది సహా నలుగురు న్యాయమూర్తుల నియామకంపై కొలీజియం మధ్య విభేదాలు తలెత్తుతున్న సంగతి తెలిసిందే. ఈ వివాదాల నేపథ్యంలో కేంద్రం ఈ లేఖను పంపినట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 30న సీజేఐ నియామకం కోసం కొలీజియం నలుగురి పేర్లను పరిశీలించాల్సివుంది. అయితే కేసుల లోడ్‌ అధికంగా ఉండటంతో ఆ రోజు సాయంత్రం వరకు జస్టిస్‌ చంద్రచూడ్‌ కోర్టులో ఉన్నందున కొలీజియం సమావేశం కాలేదు. అక్టోబర్‌ 1నుండి కోర్టుకి దసరా సెలవులు వచ్చాయి.