పండుగపూట జర భద్రం

పండుగపూట జర భద్రం
  • కరోనా ఇంకా పోలే: కేంద్ర మంత్రి

న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి ఇంకా పోలేదని, వచ్చే పండుగల సీజన్​లో గైడ్​లైన్స్ కచ్చితంగా అమలయ్యేలా చూడాలని కేంద్ర మంత్రి మన్​సుఖ్ మాండవీయ రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించారు. పండుగల సందర్భంగా జనం నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తే కరోనా మళ్లీ తీవ్రమయ్యే డేంజర్​ ఉందని హెచ్చరించారు. మహమ్మారి కట్టడికి వ్యాక్సినేషన్​లో వేగం పెంచాలని ఆదేశించారు. దేశంలో ఇప్పటికే 94 కోట్ల డోసులు వేశామని, దసరా లోపే 100 కోట్ల డోసులు వేయాలని కేంద్ర ప్రభుత్వం టార్గెట్​గా పెట్టుకుందని వివరించారు. త్వరలోనే ఈ టార్గెట్​ను అందుకుంటామని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. ఈమేరకు ప్రధాన రాష్ట్రాల ప్రిన్సిపాల్ సెక్రటరీలు, నేషనల్ హెల్త్‌‌ మిషన్ డైరెక్టర్లతో వ్యాక్సినేషన్‌‌పై కేంద్ర మంత్రి శనివారం రివ్యూ చేశారు. వ్యాక్సినేషన్‌‌ను స్పీడప్ చేయడం, కరోనా గైడ్‌‌లైన్స్‌‌ను తప్పకుండా పాటించడంతోనే వైరస్‌‌ను అదుపుచేయగలమని స్పష్టంచేశారు. 8 కోట్లకు పైగా వ్యాక్సిన్‌‌ డోసులు రాష్ట్రాల వద్ద పెండింగ్‌‌లో ఉన్నాయని మంత్రి మన్​సుక్​ మాండవీయ చెప్పారు. ఏపీ, తెలంగాణ, అస్సాం, బీహార్‌‌‌‌, చత్తీస్‌‌గఢ్‌‌, గుజరాత్‌‌, హర్యానా, జార్ఖండ్, కర్నాటక, కేరళ, మధ్యప్రదేశ్‌‌, మహారాష్ట్ర, ఒడిశా, పంజాబ్‌‌, రాజస్థాన్‌‌, తమిళనాడు, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్‌‌, బెంగాల్‌‌ అధికారులు రివ్యూలో పాల్గొన్నారు.

మరిన్ని వార్తల కోసం..

100 బిలియన్​ డాలర్ల క్లబ్‌లోకి అంబానీ

కేంద్ర మంత్రి కొడుకు ఆశిష్ మిశ్రా అరెస్టు

టార్గెట్ చేసి హత్యలు: మళ్లీ క్యాంపుల్లోకే కాశ్మీరీ పండిట్లు!