గవర్నమెంట్ ఆఫీసుల్లో చెత్త నుంచి రూ.500 కోట్లు

  గవర్నమెంట్ ఆఫీసుల్లో చెత్త నుంచి రూ.500 కోట్లు

గవర్నమెంట్ ఆఫీసుల్లో  చెత్తను అమ్మడం ద్వారా  కేంద్రం రూ.500 కోట్ల మేర ఆదాయం  సంపాదించిందని కేంద్ర సహాయ మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు.  కార్యాలయాల పరిశుభ్రతపై చేపట్టిన కార్యక్రమాలు ఇటీవల ముగిసిన సందర్భంగా  ఈ ఆదాయం సమకూరినట్లుగా ఆయన వెల్లడించారు.  2021–23 మధ్యలో గవర్నమెంట్ ఆఫీసుల్లో  చెత్త, స్ర్కాప్ ఐటమ్స్ ను అమ్మడం ద్వారా   రూ. 1,100 కోట్ల ఆదాయాన్ని పొందింది.   

2023 అక్టోబర్‌ 2వ తేదీ నుంచి 31వ తేదీ వరకు మూడో విడత కార్యక్రమాన్ని చేపట్టింది.  ప్రతి ఏటా ఈ  స్వచ్ఛ కార్యక్రమాన్ని మరింత మెరుగ్గా అమలు చేస్తామని మంత్రి తెలిపారు.  ప్రభుత్వ కార్యాలయాల్లో పరిశుభ్రతను భాగం చేయడంలో ఇది అతిపెద్ద కార్యక్రమమని పేర్కొన్నారు.  ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదేశాలతో స్ఫూర్తి పొంది,  దేశంలోని మారుమూల ప్రాంతాల్లోని 2.53 లక్షల ప్రభుత్వ  కార్యాలయాలను కవర్ చేశామని ఆయన తెలిపారు.

ALSO READ :- దుర్గగుడి హుండీ ఆదాయం రూ.8 కోట్ల 73 లక్షలు