దుర్గగుడి హుండీ ఆదాయం రూ.8 కోట్ల 73 లక్షలు

దుర్గగుడి హుండీ ఆదాయం రూ.8 కోట్ల 73 లక్షలు

విజయవాడ కనకదుర్గ గుడి హుండీకి భారీగా ఆదాయం సమకూరింది. గత మూడు రోజులు హుండీలలో సమర్పించిన కానుకలను బుధవారం లెక్కించగా 8 కోట్ల 73 లక్షల ఆదాయం నగదు రూపంలో వచ్చింది. ఆలయ  కార్యనిర్వాహణాధికారి కె.ఎస్ రామరావు, ట్రస్ట్ బోర్డు సభ్యులు, దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమీషనర్ శాంతి ఎస్ పిఎఫ్  వన్ టౌన్ పోలీసు సిబ్బంది పర్యవేక్షణలో హుండీ ఆదాయాన్ని లెక్కించారు. ఆన్ లైన్ నందు ఈ- హుండీ  ద్వారా రూ.1 కోటి 97లక్ష 207లు విరాళముగా భక్తులు చెల్లించుకున్నారు.

బుధవారం (మూడవ రోజు 01/11/2023)  హుండీ లెక్కింపు రిపోర్టు:


నగదు: 2 కోట్ల 78 లక్ష 28 వేల703 రూపాయలు

కానుకల రూపములో: 

బంగారం: 265 గ్రాములు, 
వెండి: 10 కేజీల 700 గ్రాములు 


మంగళవారం రెండవ(31/10/2023) రోజు హుండీ లెక్కింపు రిపోర్టు:

నగదు: 3 కోట్ల 36లక్షల 60వేల 500ల రూపాయలు

కానుకల రూపములో:

బంగారం: 362 గ్రాములు, 
వెండి: 8 కేజీల 950 గ్రాములు 

సోమవారం మొదటి రోజు(30-/10/-2023) హుండీ లెక్కింపు రిపోర్టు:


నగదు: రూ.2 కోట్ల 58లక్షల 64వేల 740 రూపాయలు

కానుకల రూపములో:

బంగారం: 367 గ్రాములు, 
వెండి: 8 కేజీల 745 గ్రాములు 

మూడు రోజుల మొత్తం:

నగదు: రూ.8 కోట్ల73 లక్షల 53వేల 943 రూపాయలు

కానుకల రూపములో 

బంగారం: 994 గ్రాములు, 
వెండి: 38 కేజీల 395 గ్రాములు 

విదేశీ కరెన్సీ:

యూఎస్ఏ      351 డాలర్లు,
హాంకాంగ్       డాలర్లు
కెనెడా            80 డాలర్లు
ఆస్ట్రేలియా   50 డాలర్లు
యూరో          10 యూరోలు
సింగపూర్     7 డాలర్లు
న్యూజిలాండ్  20 డాలర్లు
చైనా               1 యువన్
మలేషియా   5 రింగెట్లు
ఒమాన్          300 బైసాలు
క్వతార్          రియాల్
యూక్I ఈ    180 దిర్హమ్స్
కువైట్          6 దినార్లు.

ALSO READ :- దుష్ప్రచారం ఆపండి.. దయచేసి వాళ్లతో నన్ను పోల్చొద్దు : పాల్వాయి స్రవంతి