దుబాయిలో ఐఐటీ క్యాంపస్‌ ఏర్పాటు

దుబాయిలో ఐఐటీ క్యాంపస్‌ ఏర్పాటు

దుబాయి: యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లోని దుబాయిలో ఐఐటీని  ఏర్పాటు చేయాలని మోడీ ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో విదేశాల్లో మొట్టమొదటి ఐఐటీగా దుబాయి ఐఐటీ నిలవనుంది. భారత ప్రభుత్వ నిర్ణయం పట్ల గల్ఫ్‌ దేశాల్లోని భారతీయ విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఐఐటీలో అరబ్‌ విద్యార్థలతో పాటు భారతీయ విద్యార్థులు ప్రవేశం పొందొచ్చు. దీంతో తెలుగు విద్యార్థులకు కూడా ప్రయోజనం చేకూరనుంది.

యూఏఈ, ఇండియా మధ్య ఉన్న బంధాన్ని బలోపేతం చేయడంలో భాగంగా దుబాయిలో ఐఐటీ క్యాంపస్‌ నెలకొల్పడానికి భారత ప్రభుత్వం నిర్ణయించినట్లు యూఏఈలోని భారత రాయబారి సంజయ్‌ సుధీర్‌ ప్రకటించారు. ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ, అబుదాబీ యువరాజు షేక్‌మహమ్మద్‌ బిన్‌ జాయేద్‌ ఏఐ నహ్వాన్‌ మధ్య జరిగిన చర్చల నేపథ్యంలో దుబాయ్‌లో ఐఐటీ స్థాపనకు ముందడుగు పడింది. 

ఇవి కూడా చదవండి:

హైదరాబాద్‌లో ఫేక్ సర్టిఫికెట్స్ ముఠా అరెస్ట్

భారీగా పెరిగిన మనీ లాండరింగ్ కేసుల సంఖ్య