రిజర్వేషన్లపై యాభై శాతం క్యాప్ను ఎత్తేసేందుకు కేంద్రం అడ్డుపడుతోంది: పీసీసీ చీఫ్

రిజర్వేషన్లపై యాభై శాతం క్యాప్ను ఎత్తేసేందుకు కేంద్రం అడ్డుపడుతోంది: పీసీసీ చీఫ్

రిజర్వేషన్లపై యాభై శాతం క్యాప్ ను ఎత్తేసేందుకు కేంద్ర ప్రభుత్వం అడ్డుపడుతోందని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో బీసీ రిజర్వేషన్ల అంశంపై మాట్లాడిన ఆయన.. బీజీపీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.  బీసీ రిజర్వేషన్ బిల్లు గవర్నర్ ద్వారా కేంద్రానికి పంపించామని.. కానీ కేంద్రం ప్రభుత్వం అడ్డుపడుతోందని అన్నారు. 

ALSO READ | దేశ ఆర్థిక వ్యవస్థలో 10 శాతం తెలంగాణ అందిస్తోంది : సీఎం రేవంత్

 బీసీల పట్ల బీజేపీ పార్టీ కి ప్రేమ లేదన్నారు మహేష్ కుమార్ గౌడ్.  మొదటి నుంచి బీసీ రిజర్వేషన్ల పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి బాహాటంగానే వ్యతిరేకిస్తూన్నారని అన్నారు. ఎస్ సి, ఎస్ టి, బీసీ మైనార్టీల పట్ల ఎందుకు మీకు వివక్ష..? అని కిషన్ రెడ్డి ని సూటిగా ప్రశ్నిస్తున్నట్లు చెప్పారు. 

ముస్లింలను సాకుగా చూపించి బీసీ బిల్లును అడ్డుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఉత్తరప్రదేశ్ లో బీజేపీ ప్రభుత్వం ఉందని.. ఇక్కడ మెలిక పెడుతున్నవళ్లు అక్కడ ఎలా అమలు చేస్తున్నారని ప్రశ్నించారు.  కేంద్ర ప్రభుత్వానికి కనువిప్పు కావాలని  ఆరవతేదీన జంతర్ మంతర్ వద్ద  ముఖ్యమంత్రితో సహా అందరూ ధర్నా చేస్తున్నట్లు తెలిపారు. 

ఢిల్లీలో చేపట్టనున్న ధర్నా గురించి మాట్లాడిన పీసీసీ చీఫ్.. బీసీ రిజర్వేషన్ల బిల్లు సాధనకై పన్నెండు వందల మంది నాయకులు ట్రైన్ ద్వారా ఢిల్లీ వెళుతున్నట్లు తెలిపారు. వాకిటి శ్రీవారి , పొన్నం ప్రభాకర్, ఇన్ ఛార్జ్ మీనాక్షి నటరాజన్ తో కలిసి చర్లపల్లి నుంచి నాయకుల తో ఆలేరు వరకు ట్రైన్ లోజర్నీ చేసినట్లు చెప్పారు.  బీసీ రిజర్వేషన్ల బిల్లు యావత్ దేశానికి తెలంగాణ రోల్ మోడల్ గా  మారిందన్నారు.