రైతులకు అండగా నిలిస్తే కక్ష కడతారా?

రైతులకు అండగా నిలిస్తే కక్ష కడతారా?

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వంపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ విమర్శలకు దిగారు. కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న అన్నదాతలకు తాను మద్దతుగా నిలించినందుకు కేంద్రం ఆప్ ప్రభుత్వాన్ని శిక్షిస్తోందని ఆరోపించారు. హరియాణాలోని జింద్ జిల్లాలో నిర్వహించిన కిసాన్ మహాపంచాయత్ లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 'నన్ను శిక్షించడానికి పార్లమెంటులో కేంద్రం ఓ బిల్లును తీసుకొచ్చింది. ఇది మాకు చాలా బాధను కలిగించింది. రైతులకు మద్దతుగా నిలిచినందుకు మాపై పగ సాధిస్తున్నట్లు కనిపిస్తోంది' అని కేజ్రీవాల్ స్పష్టం చేశారు. దేశ రాజధానిలో ప్రభుత్వంలో లెఫ్టినెంట్ గవర్నర్ (ఎల్)జీ అధికారాలను పెంచే జీఎన్సీటీడీ యాక్ట్ ను కేంద్రం తీసుకొచ్చింది. దీనిపై కేజ్రీ ఫైర్ అవుతున్నారు. ఇప్పుడు అన్ని అధికారాలు ఎల్జీ చేతిలోకి వెళ్లిపోయాయని ఫైర్ అయ్యారు. సాగు చట్టాల విషయంలో కేంద్రానికి అనుకూలంగా మాట్లాడితే దేశభక్తులని.. వ్యతిరేకంగా మాట్లాడితే దేశ ద్రోహులుగా చిత్రీకరిస్తున్నారని పేర్కొన్నారు. రైతుల కోసం ఏ త్యాగం చేయడానికైనా రెడీ అన్నారు.