
న్యూఢిల్లీ: ఈ ఆర్థిక సంవత్సరంలో స్టేట్డిసాస్టర్ రెస్పాన్స్ ఫండ్ (ఎస్డీఆర్ఎఫ్) కింద 22 రాష్ట్రాలకు రూ.9,578.40 కోట్లు విడుదల చేసినట్టు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ప్రకృతి వైపరీత్యాల కారణంగా నష్టపోయిన వారిని ఆదుకోవడానికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేంద్ర వాటాగా ప్రభుత్వం ఈ నిధులు విడుదల చేసిందని మంగళవారం లోక్‌సభకు తెలిపింది.
ఎస్‌డీఆర్‌ఎఫ్, నేషనల్ డిసాస్టర్ రెస్పాన్స్ఫండ్ (ఎస్డీఆర్ఎఫ్) కింద అందించే ఆర్థిక సహాయం నష్టపరిహారం కోసం కాకుండా, సహాయం అందించేందుకు మాత్రమేనని కేంద్ర హోం వ్యవహారాల సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ లిఖితపూర్వక సమాధానమిచ్చారు. హిమాచల్ లో ఇటీవలి వరదలు, కొండచరియల నష్టాన్ని అంచనా వేయడానికి ఇంటర్-మినిస్టీరియల్ సెంట్రల్ టీమ్‌ను ఏర్పాటు చేయడం జరిగిందని మంత్రి తెలిపారు.