కస్టమర్లకు గుడ్ న్యూస్.. తొమ్మిది సైజుల్లోనే బ్రాండెడ్ వంట నూనె ప్యాకెట్లు

కస్టమర్లకు గుడ్ న్యూస్.. తొమ్మిది సైజుల్లోనే బ్రాండెడ్ వంట నూనె ప్యాకెట్లు

న్యూఢిల్లీ: వినియోగదారులు వివిధ బ్రాండ్ల వంటనూనెల ధరలను సులభంగా పోల్చి చూసుకుని, సరైన నిర్ణయం తీసుకునేలా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. 'లీగల్ మెట్రాలజీ' ఫ్రేమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వర్క్ కింద పేర్కొన్న సైజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లలోనే  వంటనూనెల ప్యాకింగ్ ఉండాలని ఆదేశించింది.  తయారీదారులు ఈ కొత్త నిబంధనలను పాటించడానికి 3 నెలల గడువు  ఇచ్చారు. కంపెనీలు అనుకుంటే తక్షణమే వీటిని అమలు చేయొచ్చు. ఇకపై పామాయిల్, సోయాబీన్, సన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫ్లవర్, ఆవాల నూనె, వేరుశనగ, నువ్వులు, రైస్ బ్రాన్, కాటన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీడ్, కార్న్ ఆయిల్,  బ్లెండెడ్ వంటనూనెలను 9 సైజులలో మాత్రమే ప్యాక్ చేయాలి. ఇవి 200 ఎంఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌/జీ, 500 ఎంఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌/జీ, 1 లీటరు/కేజీ, 2 లీటర్లు/కేజీ, 3 లీటర్లు/కేజీ, 4 లీటర్లు/కేజీ, 5 లీటర్లు/కేజీ, 15 లీటర్లు/కేజీ,  20 లీటర్లు/కేజీ ప్యాకుల్లో వస్తాయి.