
- ఎదురుపడి పలకరించుకున్న బండి సంజయ్, కేటీఆర్
రాజన్నసిరిసిల్ల, వెలుగు: నిత్యం ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకునే కేంద్ర మంత్రి బండి సంజయ్, మాజీ మంత్రి కేటీఆర్ గురువారం ఒకరినొకరు పలకరించుకున్నారు. మానేరు ఉధృతిని పరిశీలించడానికి ఇద్దరు నేతలు ఎదురుపడ్డారు. దీంతో పరస్పరం పలకరించుకొని ‘సంజయ్ అన్నా మీరు మంచిగుండాలే’ అని కేటీఆర్ అనడంతో అమ్మ వారి దయవల్ల ‘మీరు కూడా మంచిగుండాలే’ అని బండి సంజయ్ అన్నారు.