తిరుమల శ్రీవారి సేవలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ

తిరుమల శ్రీవారి సేవలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ

 కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని... తిరుమల శ్రీవారిని  కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ దర్శించుకున్నారు.. కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకోవడానికి నిన్న(శుక్రవారం) రాత్రి ఆయన కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్నారు.

 ఈ రోజు శనివారం( ఆగస్టు 2)  ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామి వారి సేవలో కుటుంబ సభ్యులతో కలసి పాల్గొన్నారు. టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి వారికి ఘన స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆలయంలోకి వెళ్లిన నితిన్ గడ్కరీ దంపతులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించారు. 

ALSO READ : పవిత్రోత్సవాలకు తిరుమల సర్వం సిద్ధం : 500 ఏళ్లుగా సాగుతున్న పవిత్ర సంప్రదాయం

దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించగా….. ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు. ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ…. దేశం, ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు.