యూజర్ల కోసం గైడ్‌‌‌‌లైన్స్ ప్రకటించిన సెర్ట్‌‌‌‌

యూజర్ల కోసం గైడ్‌‌‌‌లైన్స్ ప్రకటించిన సెర్ట్‌‌‌‌

బిజినెస్‌‌‌‌‌‌ డెస్క్‌‌‌‌, వెలుగు: దేశంలో ఇంటర్నెట్ వాడకం విపరీతంగా పెరుగుతోంది. అంతేవేగంగా సైబర్‌‌‌‌ క్రైమ్స్‌‌‌‌ కూడా ఎక్కువవుతున్నాయి. హాని చేసే లింక్‌‌‌‌లను స్మార్ట్‌‌‌‌ఫోన్ యూజర్లకు పంపి మోసాలకు పాల్పడుతున్నారు సైబర్ నేరగాళ్లు. క్యాష్ ప్రైజ్‌‌‌‌లు గెలుచుకున్నారని, రివార్డ్స్‌‌‌‌ దక్కించుకున్నారని హానికరమైన లింక్‌‌‌‌లను ఈ–మెయిల్ ద్వారా, ఎస్‌‌‌‌ఎంఎస్‌‌‌‌ ద్వారా యూజర్లకు పంపుతున్నారు. వారిని ఆకర్షిస్తున్నారు.  సైబర్ క్రైమ్స్‌‌‌‌ను తగ్గించేందుకు ప్రభుత్వం ప్రజల్లో అవగాహన పెంచుతోంది. సైబర్ నేరాల బారిన పడకుండా ఉండాలంటే  స్మార్ట్‌‌‌‌ఫోన్ యూజర్లు ఏం చేయాలి? ఏం చేయకూడదు? అనే గైడ్‌‌‌‌లైన్స్‌‌‌‌ను ప్రభుత్వ సంస్థ ఇండియన్ కంప్యూటర్ ఎమెర్జెన్సీ రెస్పాన్స్ టీమ్‌‌‌‌ (సెర్ట్‌‌‌‌–ఇన్‌‌‌‌)  ప్రకటించింది. ఎలక్ట్రానిక్స్ మినిస్ట్రీ కింద పనిచేసే ఈ సంస్థ యూజర్లు యాప్‌‌‌‌లు వాడినా, నెట్‌‌‌‌లో బ్రౌజింగ్ చేసినా జాగ్రత్తగా ఉండాలని ఇది హెచ్చరిస్తోంది. 

సెర్ట్ విడుదల చేసిన గైడ్‌‌‌‌లైన్స్ ప్రకారం..

  • ఆఫీషియల్‌‌‌‌ యాప్‌‌‌‌ స్టోర్లు అయిన గూగుల్‌‌‌‌ ప్లే, యాప్ స్టోర్‌‌‌‌‌‌‌‌ల నుంచే యాప్‌‌‌‌లను డౌన్‌‌‌‌లోడ్ చేసుకోవాలి. ఫలితంగా డౌన్‌‌‌‌లోడ్‌‌‌‌ సోర్స్‌‌‌‌లను పరిమితంగా ఉంచడానికి వీలుంటుంది. హానిచేయగలిగే యాప్‌‌‌‌లను డౌన్‌‌‌‌లోడ్ చేసుకోవడాన్ని నియంత్రించొచ్చు. 
  • యాప్‌‌‌‌లను డౌన్‌‌‌‌లోడ్ చేసుకునే ముందు ఎల్లప్పుడూ ఈ యాప్‌‌‌‌ వివరాలను, యూజర్ల రివ్యూలను, డౌన్‌‌‌‌లోడ్స్ నెంబర్‌‌‌‌‌‌‌‌ను, కామెంట్స్‌‌‌‌ను పరిశీలించాలి.  ఇంకా ‘అదనపు సమాచారం’ లోని వివరాలను గమనించాలి.
  • స్మార్ట్‌‌‌‌ఫోన్‌‌‌‌లోని  ఏయే పర్మిషన్లను యాప్‌‌‌‌ తీసుకుంటుందో చూడాలి. యాప్‌‌‌‌కు సంబంధం ఉన్న పర్మిషన్లను మాత్రమే ఇవ్వాలి.
  • సైడ్‌‌‌‌లోడెడ్‌‌‌‌ యాప్‌‌‌‌లు (సాధారణంగా వెబ్‌‌‌‌సైట్ల నుంచి, ఇతర మొబైల్‌‌‌‌ ఫోన్‌‌‌‌లు, మెమరీ కార్డుల నుంచి డౌన్‌‌‌‌లోడ్ చేసుకునే యాప్‌‌‌‌లు) ఇన్‌‌‌‌స్టాల్ చేసే ముందు  ‘నమ్మదగ్గని సోర్స్‌‌‌‌ల నుంచి’ అనే చెక్ బాక్స్‌‌‌‌ను క్లిక్ చేసి పర్మిషన్లు ఇవ్వొద్దు. ఇలా చేస్తే  సోర్స్ ఏదైనా కాని యాప్‌‌‌‌లు మన ఫోన్లలో ఇన్‌‌‌‌స్టాల్ అయిపోతాయి.  
  • స్మార్ట్‌‌‌‌ఫోన్ తయారీ కంపెనీలు ఎప్పటికప్పుడు ఇచ్చే  ఆండ్రాయిడ్ అప్‌‌‌‌డేట్లను, సాఫ్ట్‌‌‌‌వేర్ పాచ్‌‌‌‌లను  ఇన్‌‌‌‌స్టాల్ చేసుకోవాలి.
  • గుర్తు తెలియన ఈ–మెయిల్స్‌‌‌‌, ఎస్‌‌‌‌ఎంఎస్‌‌‌‌ల నుంచి వచ్చే లింక్‌‌‌‌లను క్లిక్ చేయొద్దు. నమ్మదగ్గని  వెబ్‌‌‌‌సైట్‌‌‌‌లను బ్రౌజ్ చేయొద్దు.
  • స్మార్ట్‌‌‌‌ఫోన్లకు మెసేజ్‌‌‌‌లు పంపేవారి నెంబర్ నిజమైందా? ఫేకా? అనే విషయాన్ని ముందుగానే తెలుసుకోవాలి. సాధారణంగా స్కామర్లు తమ ఐడెంటెటీని దాచడానికి ఈ–మెయిల్‌‌‌‌, టెక్స్ట్‌‌‌‌ సర్వీస్‌‌‌‌లను వాడుతుంటారు. బ్యాంకులు మెసేజ్‌‌‌‌లు పంపితే పంపిన వారి వివరాల దగ్గర బ్యాంక్‌‌‌‌ ఐడీ షార్ట్‌‌‌‌ ఫార్మెట్‌‌‌‌లో కనిపిస్తుంది. ఎటువంటి  ఫోన్ నెంబర్ ఉండదు.

ముందే పరిశీలించి..

  • మెసేజ్‌‌‌‌‌‌లలోని లింక్‌‌‌‌లను క్లిక్ చేయాలనుకునే ముందు వాటి గురించి రీసెర్చ్ చేయాలి.  ఫోన్‌‌‌‌ నెంబర్‌‌‌‌‌‌‌‌ను సెర్చ్ చేసి ఈ ఫోన్ నెంబర్‌‌‌‌‌‌‌‌  సక్రమమైందా? కాదా? అనేది తెలుసుకోవడానికి కొన్ని వెబ్‌‌‌‌సైట్లు వీలు కలిపిస్తున్నాయి.
  • వెబ్‌‌‌‌సైట్‌‌‌‌ డొమైన్‌‌‌‌ను క్లియర్‌‌‌‌‌‌‌‌గా ఇచ్చే యూఆర్‌‌‌‌‌‌‌‌ఎల్‌‌‌‌లను మాత్రమే క్లిక్ చేయాలి. అనుమానం ఉంటే సంబంధిత ఆర్గనైజేషన్ వెబ్‌‌‌‌సైట్‌‌‌‌ను డైరెక్ట్‌‌‌‌గా సెర్చింజన్‌‌‌‌ల ద్వారా వెతకాలి. ఈ వెబ్‌‌‌‌సైట్‌‌‌‌ నిజమైందా? కాదా? అని తెలుసుకోవాలి. 
  • యాంటివైరస్‌‌‌‌, యాంటిస్పైవేర్‌‌‌‌‌‌‌‌ సాఫ్ట్‌‌‌‌వేర్‌‌‌‌‌‌‌‌లను ఇన్‌‌‌‌స్టాల్ చేసుకోవాలి. ఎప్పటికప్పుడు అప్‌‌‌‌డేట్ చేసుకోవాలి.
  • సేఫ్‌‌‌‌గా బ్రౌజింగ్ చేసుకోవడానికి వీలు కలిపించే టూల్స్‌‌‌‌ను, ఫిల్టరింగ్ టూల్స్‌‌‌‌ను వాడాలి.
  • బిట్‌‌‌‌.ఎల్‌‌‌‌వై, టినీయూఆర్‌‌‌‌‌‌‌‌ఎల్‌‌‌‌ వంటి చిన్న ఫార్మెట్‌‌‌‌లోని యూఆర్‌‌‌‌‌‌‌‌ఎల్‌‌‌‌లను వాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. వీటి ఫుల్‌‌‌‌ వెబ్‌‌‌‌సైట్‌‌‌‌ డొమైన్‌‌‌‌ను తెలుసుకోవాలి. 
  • ఏదైనా వెబ్‌‌‌‌సైట్‌‌‌‌లో సెన్సిటివ్ ఇన్‌‌‌‌ఫర్మేషన్‌‌‌‌ను, పర్సనల్ డిటైల్స్‌‌‌‌ను ఇచ్చే ముందు బ్రౌజర్‌‌‌‌‌‌‌‌ అడ్రస్ బార్‌‌‌‌‌‌‌‌ దగ్గర గ్రీన్ కలర్‌‌‌‌‌‌‌‌లోని ఎన్‌‌‌‌క్రిప్టెడ్‌‌‌‌ లాక్ ఉందో లేదో చెక్ చేసుకోవాలి. ఉంటేనే ప్రొసీడ్ అవ్వాలి.
  • కస్టమర్లు తమ బ్యాంక్‌‌‌‌ అకౌంట్లలో ఎటువంటి అసాధారణ యాక్టివిటీని గమనించినా వెంటనే సంబంధిత బ్యాంక్‌‌‌‌కు  తెలియజేయాలి.